నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Updated: Nov 19, 2019, 11:15 AM IST
నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
Representational image

హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శ్రీలంక దక్షిణ తీరానికి ఆనుకుని వున్న హిందూ మహా సముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించిందని.. ఈ ద్రోణి ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఇదిలావుంటే, మరోవైపు రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చలి తీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.