Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం, ఏపీ- తెలంగాణల్లో భారీ వర్షాలు
Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న ఐదు రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలుు ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains Alert: తూర్పు ఆసియా దేశాల నుచి వస్తున్న మేఘాలు తెలుకు రాష్ట్రాలపై భారీగా విస్తరించాయి. మరోవైపు బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో వచ్చే మూడ్రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరోవైపు తూర్పు ఆసియా ప్రాంతం నుంచి మేఘాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా రానున్న 5 రోజులు ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తింది. సాధారణం కంటే భారీ వర్షపాతం నమోదు కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఐఎండీ కొన్ని జిల్లాలలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాబ్, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంపై విస్తరించిన మేఘాలు రానున్న రెండ్రోజుల్లో పూర్తిగా వ్యాపించనున్నాయి. భారీగా మేఘాలు ఆవహించనున్నాయి. తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి.
తెలుగు రాష్ట్రాలపై దట్టమైన మేఘాలు భారీగా విస్తరించనున్నాయి. ఈ మేఘాలు వ్యాపించే కొద్దీ వర్షాల తీవ్రత పెరగవచ్చు. అందుకే రానున్న 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన పొంచి ఉంది. అదే సమయంలో ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పదికి పైగా భవనాలు కొండ చరియల్నించి నేల కూలాయి. మృతుల సంఖ్య 20కు చేరింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్,.ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: TVS Showroom Fire Accident: భారీ అగ్నిప్రమాదం..300 వాహనాలు బుగ్గిపాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook