Rains Alert: ఏపీలో రానున్న మూడ్రోజులు విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు
Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం క్రమంగా విస్తరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి బారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి సీతారారాజు, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం మన్యం, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి, అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశమున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
మరోవైపు అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది. వచ్చే మూడ్రోజులు తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు , మెరుపులతో కూడజి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు. ముఖ్యంగా పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Also read: YCP First List: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం, దసరాకే తొలి జాబితా, ఎవరెవరికి ప్రాధాన్యతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook