Nellore Gun Fire: నెల్లూరు జిల్లాలో దారుణం, ప్రియురాలిని తుపాకీతో కాల్చి, తనను తాను కాల్చుకున్న ప్రేమికుడు
Nellore Gun Fire: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రేమికుడు దారుణానికి ఒడిగట్టాడు. తన వెంట తెచ్చుకున్న గన్ తో ప్రియురాలిని కాల్చి.. తనను తాను కూడా కాల్చుకున్నాడు.
Lover Kills His Girlfriend: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. గన్ తో ఆమెను కాల్చి.. తాను కూడా కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు కూడా చనిపోయారు. ఈ ఘటన పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి, పొలకూరు కావ్య ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు బెంగళూరులో ఉండే ఉద్యోగాలు చేస్తున్నారు. అయివే కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటినుంచే కూడా జాబ్ లు చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం వారి ఇంట్లో తెలిసింది. సురేష్ తో వివాహం చేసేందుకు కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.
ఈ క్రమంలోనే తుపాకీతో వెళ్లిన సురేష్.. కావ్యను మాట్లాడుకుందాం బయటకు రా అని పిలిచాడు. కావ్య రాగానే కొద్దిసేపు మాట్లాడిన సురేష్ పెళ్లి చేసుకుందామన్నాడు. అయితే పెద్దల అంగీకారం లేనిదే పెళ్లి చేసుకోలేమని కావ్య తేల్చిచెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన సురేష్.. తొలుత కావ్యను గన్ తో కాల్చాడు. ఆ తర్వాత తనను తాను కూడా కాల్చుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు కాకుండా బందోబస్తు చేపట్టారు.
Also Read: Niramala: మంచి మనసు చాటుకున్న నిర్మలా సీతారామన్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.