రేపు మ‌న‌మున్నా లేక‌పోయినా చ‌రిత్ర ఉంటుంది.. మ‌న ప్రేమ‌క‌థ‌ను వినిపిస్తుంది! వెన్నెల ఇంట్ర‌డ‌క్ష‌న్ సూపర్

Soul of Vennela released from Virata Parvam​ on Sai Pallavi Birthday. నేడు హీరోయిన్ సాయి ప‌ల్ల‌వికి పుట్టిన‌రోజు సందర్భంగా విరాట‌ప‌ర్వం మూవీ నుంచి వెన్నెల‌ పాత్రను ప‌రిచ‌యం చేస్తూ.. ఓ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 04:53 PM IST
  • రేపు మ‌న‌మున్నా లేక‌పోయినా చ‌రిత్ర ఉంటుంది
  • మ‌న ప్రేమ‌క‌థ‌ను వినిపిస్తుంది
  • వెన్నెల‌ పాత్రను ప‌రిచ‌యం చేస్తూ
రేపు మ‌న‌మున్నా లేక‌పోయినా చ‌రిత్ర ఉంటుంది.. మ‌న ప్రేమ‌క‌థ‌ను వినిపిస్తుంది! వెన్నెల ఇంట్ర‌డ‌క్ష‌న్ సూపర్

Sai Pallavi Birthday Special: Soul of Vennela video released from Virata Parvam: యువ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా 'విరాట‌ప‌ర్వం'. 1990ల‌లో జరిగిన వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విరాట‌ప‌ర్వం చిత్రంలో ప్రియమణి, నివేతా పేతురాజ్, నవీన్‌ చంద్ర, ఈశ్వరీరావు, నందితా దాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

నేడు హీరోయిన్ సాయి ప‌ల్ల‌వికి పుట్టిన‌రోజు సందర్భంగా విరాట‌ప‌ర్వం మూవీ నుంచి వెన్నెల‌ పాత్రను ప‌రిచ‌యం చేస్తూ.. ఓ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఒక నిమిషం 38 సెకండ్ల నిడివి గల ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. 'వెన్నెల రెండు సార్లు జన్మించింది. తొలి పొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లిలో ఒకసారి. ఆశయాన్ని ఆయుధంగా చేసినట్టు అతని ప్రేమలో మరోసారి' అని స్క్రీన్‌పై వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. 

'నిర్బంధాల‌ను కౌగిలించుకున్న వ‌సంత‌కాలం మ‌న‌ది. రేపు మ‌న‌మున్నా.. లేక‌పోయినా చ‌రిత్ర ఉంటుంది. మ‌న ప్రేమ‌క‌థ‌ను వినిపిస్తుంది' అని సాయి ప‌ల్ల‌వి చెప్పే డైలాగ్ బాగుంది. విరాట‌ప‌ర్వం నుంచి విడుదల అయిన ఈ స్పెషల్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలవనుంది. 

విరాట‌ప‌ర్వం సినిమాని జులై 1న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇప్పటికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా.. నక్సలైట్‌ నాయకుడు రవన్న (అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌) జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందుతోంది. నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు 1990లో ఎలా ఉండేవి.. పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారు. విరాట‌ప‌ర్వం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ సినిమాలపై భారీ అంచనాలను పెంచాయి. 

Also Read: CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!

Also Read: Niramala: మంచి మనసు చాటుకున్న నిర్మలా సీతారామన్‌, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News