Govt announces Police Medals: ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs)  మెడల్స్‌ను ప్రకటించింది. ఈ పోలీస్ మెడల్స్‌ ( Police Medals) ను స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందజేయడం ప్రతీఏటా ఆనవాయితీగా వస్తుంది. 2020 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి 16 మంది‌, తెలంగాణ నుంచి 14 మంది పోలీసులు మెడల్స్‌ అందుకోనున్నారు. ఏపీకి దక్కిన 14 పతకాల్లో.. రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్స్‌, 14 ఉత్తమ సేవా పోలీసు మెడల్స్‌ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్స్‌కు, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌నకు ఎంపికయ్యారు. అదేవిధంగా 10 మంది ఉత్తమ సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. Also read: India: 25లక్షలకు చేరువలో కరోనా కేసులు



అయితే 2020 సంవత్సరానికి గాను 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్ (PMG) కు, 80ని మందిని రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM) కు , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాల(PM)కు కేంద్రహోంశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర సాయుధ బలగాల వారీగా అవార్డుల వివరాల జాబితాను శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. 81 గ్యాలంట్రీ పోలీస్ మెడల్స్‌తో జమ్మూ కాశ్మీర్ అగ్రస్థానంలో నిలవగా.. కేంద్ర సాయుధ బలగాల కింద సీఆర్పీఎఫ్‌కు అత్యధికంగా 51 పతకాలు దక్కాయి. Also read: Nepotism: Sadak 2 ట్రైలర్‌కు 8మిలియన్ల డిస్‌లైక్‌లు