Vande Bharat Trains: విశాఖపట్నం నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు
Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. భారతీయ రైల్వే మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది. అందులో ఒకటి ఏపీ, తెలంగాణ మధ్య అయితే మరొకటి ఏపీ, ఒడిశా మధ్య నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vande Bharat Trains: భారతీయ రైల్వే గత రెండు మూడేళ్లుగా దేశంలోని వివిధ నగరాల మధ్య నడుపుతున్న వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో పాటు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకోనుండటంతో వందేభారత్ రైళ్లకు ఆక్సుపెన్సీ పెరుగుతోంది. అందుకే ఆక్సుపెన్సీని బట్టి అదనపు రైళ్లను కూడా కేటాయిస్తోంది ఇండియన్ రైల్వే.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కనెక్ట్ చేస్తూ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఇప్పటికే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది. అటు విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య కూడా వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు ఆక్సుపెన్సీ రేటు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ఈ రెండు నగరాల మధ్య మరో రైలును కేటాయించారు. ఇప్పటికే నడుస్తున్న విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై..మద్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అటు నుంచి సికింద్రాబాద్‌లో మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం హాల్ట్‌లు ఉన్నాయి.
ఇప్పుడు ప్రదాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈనెల 12వ తేదీన మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రైలు గురువారం మినహా మిగిలిన రోజుల్లో నడుస్తుంది. రైలు నెంబర్ 20707 సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మద్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి రైలు నెంబర్ 20708 మద్యాహ్నం 2.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై..రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక రెండవ వందేభారత్ రైలు కూడా ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు విశాఖపట్నం-పూరి మధ్య నడుస్తుంది. రైలు నెంబర్ 20841 పూరిలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి రైలు నెంబర్ 20842 మద్యాహ్నం 3.40 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు పూరి చేరుకుంటుంది. ఈ రైలుకు కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో హాల్ట్‌లు ఉన్నాయి.
Also read: Vande Bharat Sleeper Trains: నిర్మాణం పూర్తి చేసుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు, త్వరలోనే ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook