Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్ పొరపాటు.. 37 మంది ప్రయాణికుల లగేజీ మిస్సింగ్
Indigo Airlines Forgot Passengers Luggage At Hyderabad Airport: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానం బయలుదేరింది. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే.. ప్రయాణికులు తమ లగేజీ కోసం వెతికారు. గంటల తరబడి లగేజీ బెల్ట్ వద్దే నిలబడ్డారు. అయితే చివరకు వారి బ్యాగులను హైదరాబాద్‌లోనే మర్చిపోయి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Indigo Airlines Forgot Passengers Luggage At Hyderabad Airport: వారు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమానంలో బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎయిర్‌పోర్టులో దిగి.. తమ లగేజీ కోసం నిలబడ్డారు. లగేజీ బెల్ట్ వద్ద అందరి బ్యాగులు వస్తున్నాయి కానీ వాళ్లవి మాత్రం రావడం లేదు. ఎంతసేపు అయినా తమ బ్యాగులు రాకపోవడంతో ఆందోళన చెంది.. ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ల బ్యాగులు అన్ని హైదరాబాద్‌లోనే సిబ్బంది మర్చిపోయి వచ్చినట్లు తేలింది. గురువారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు 6ఈ 409 విమానం గురువారం బయలుదేరినట్లు చెబుతున్నారు. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే ప్రయాణికులు తమ లగేజీ కోసం వెతికారు. చాలా సేపు లగేజీ బెల్ట్ వద్ద తమ బ్యాగుల కోసం నిరీక్షించారు. చివరకు విమానంలో వస్తున్న 37 మంది లగేజీ మాయమైనట్లు తెలిసింది. గంటల తరబడి వెయిట్ చేసిన తరువాత హైదరాబాద్‌లోనే తమ లగేజీని వదిలేసినట్లు సమాచారం అందిందని ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల లగేజీని సురక్షితంగా వారి అడ్రస్‌కు డెలివరీ చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిన విమానంలో 37 బ్యాగులు మిగిలి ఉన్నాయని తాము ధృవీకరిస్తున్నామని తెలిపింది. ఈ పొరపాటుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. 37 మంది ప్రయాణికుల లగేజీని ఎయిర్‌లైన్స్ వారి ఇళ్లకు డెలివరీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ 37 మంది ప్రయాణికుల లగేజీని సురక్షితంగా డెలివరీ చేసే బాధ్యతను ఇండిగో తీసుకుంది. ఇండిగో క్షమాపణలు చెప్పడంతో ప్రయాణికులు శాంతించారు.
కాగా ఇటీవల ఎయిర్‌లైన్స్ లోపాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం 50 మంది ప్రయాణికులను బెంగుళూరులోనే మర్చిపోయి వెళ్లగా.. ఆ తరువాత స్కూట్ ఎయిర్‌లైన్స్ 35 మంది ప్రయాణికులను అమృత్‌సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చింది. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణిల లగేజీని హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది.
Also Read: CM Jagan Mohan Reddy: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లోకి డబ్బులు జమ.. ఒక్కొక్కరికి రూ.లక్ష
Also Read: Loan Interest Rate: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి