YSR Kalyanamasthu YSR Shadi Tofa: జగన్ సర్కార్ మరో ప్రతిష్టాత్మక పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద శుక్రవారం లబ్ధిదారుల ఖాతాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.లక్ష జమ చేయనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది అక్టోబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ మధ్య వివాహాలు చేసుకున్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లింలకు షాదీ తోఫా పేరుతో పథకం కింద నగదు అందజేయనున్నారు.
ఈ పథకాల కింద అర్హులపై వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది ప్రభుత్వం. అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.లక్షా 20 వేలు సాయం ఇవ్వనుంది. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుందని తెలిపారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు http://gsws-nbm.ap.gov.in ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారించి.. లబ్ధిదారులు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలకు తీసుకెళితే.. అక్కడ సిబ్బంది దరఖాస్తు ప్రక్రియను చేస్తారని చెప్పారు. వరుడుకి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు వయస్సు నిండి ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా వధూవరులు ఖచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద సాయాన్ని ప్రతి మూడు నెలలకు లబ్ధిదారులకు అందిస్తుందని.. వివాహమైన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
వీరికి వర్తించదు..
==> మూడెకరాల కంటే మాగాణి.. పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు
==> పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అనర్హులు
==> ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు వర్తించదు (ప్రభుత్వం పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు)
==> ఎవరికైనా సొంతంగా ఫోర్ వీలర్ వాహనం ఉంటే అనర్హులు. (ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపు)
==> విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి
==> ఆదాయ పన్ను చెల్లించేవారు అనర్హులు
==> పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి ఉన్నవాళ్లు అనర్హులు.
Also Read: TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సూపర్ డిస్కౌంట్
Also Read: Loan Interest Rate: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి