Vijayawada Airport: విజయవాడ వాసులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఢిల్లీకి రోజు ఇండిగో విమాన సేవలు
Daily IndiGo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
Indigo Flight Service: ఆంధ్రప్రదేశ్‌కు మరో శుభవార్త. దేశ రాజధాని.. ఏపీ రాష్ట్ర రాజధానికి మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆసక్తికర విషయాన్ని పంచుకోవడానికి తాను సంతోషిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Kadapa Airport: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్.. ఎక్కడికైనా కడప నుంచి నిమిషాల్లో జర్నీ
విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రతినిత్యం ఇండిగో విమానం ఢిల్లీకి రాకపోకలు సాగించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 'ఎక్స్' వేదికగా తెలిపారు. 'విజయవాడ-ఢిల్లీ మధ్య ఇండిగో సంస్థ రోజు విమాన సర్వీసులను ప్రారంభిస్తుందనే ప్రకటన చేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ నుంచి ఢిల్లీకి రాకపోకలు ప్రారంభిస్తుంది. ఈ విమానాల అనుసంధానంతో ఢిల్లీ-అమరావతి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇది సాధ్యం చేసిన వారందరికీ కృతజ్ఞతలు' అని వివరించారు. ఈ సందర్భంగా విమాన రాకపోకల సమయాన్ని వెల్లడించారు.
Also Read: Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలు
విమాన సేవల సమయం
విజయవాడ నుంచి ఢిల్లీ: బయలుదేరు సమయం ఉదయం: 11.10 గంటలకు, ఢిల్లీకి చేరుకునే సమయం మధ్యాహ్నం: 1.40 గంటలకు
ఢిల్లీ నుంచి విజయవాడ: బయలుదేరు రాత్రి 08.10 గంటలకు, విజయవాడ చేరుకునే సమయం రాత్రి 10.40 గంటలకు
ఏపీకి మంచి రోజులు
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక ప్రయోజనాలు అందుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌లో అగ్రతాంబూలం లభించగా.. ఇక విమాన సేవల పరంగా భారీ ప్రయోజనం చేకూరుతోంది. పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు వద్ద ఉండడంతో ఆయన సాధ్యమైనంత స్వరాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కడప విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రతినిత్యం అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని వివిధ నగరాలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రతినిత్యం విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పుడు విజయవాడకు ఇండిగో విమానం అందుబాటులోకి రాగా మరిన్ని విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీలో విమాన సేవలను మరింత పెంచే యోచనలో రామ్మోహన్ నాయుడు ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏపీకి భారీగా లబ్ధి చేకూరుతుండడం ఆహ్వానించే విషయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి