నెల్లూరు  జిల్లాలో పోలీసులు మానవత్వం మరిచిపోయారు.  చట్టాన్ని చట్టుబండలు చేశారు. చిన్నారితో వెట్టిచాకిరీ చేయిస్తూ వేడుక చూశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నారితో వెట్టిచాకిరీ..!!
చట్టం మరిచిన పోలీసులు..!!
నెల్లూరు  జిల్లాలో చట్టం చట్టుబండలు..
ఆత్మకూరు ఘటనపై డీజీపీ సీరియస్
శాఖాపరమైన చర్యలకు ఆదేశం..!!


నెల్లూరు జిల్లా ఆత్మకూరు జూనియర్ కాలేజీలో జరిగిన ఘటన.. పోలీసు శాఖకు మాయని మచ్చగా మారింది. ఆత్మకూరు జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం కోసం కేంద్రం ఏర్పాటు  చేశారు. ఎస్కార్ట్ భద్రతగా వచ్చిన పోలీసుల కోసం ఆత్మకూరు కాలేజీలో ఓ గది కేటాయించారు. ఐతే ఈ గది శుభ్రంగా లేకపోవడంతో వాచ్ మెన్ కుమార్తెతో పోలీసులు తుడిపించారు. ఆ చిన్నారి వయసు కేవలం 7  సంవత్సరాలు. ఆ అమ్మాయి గుడ్డతో నేలను శుభ్రం చేస్తుంటే హెడ్ కానిస్టేబుళ్లు వేడుక చూశారు. కనీసం మైనర్లతో పని చేయించకూడదు.. ఇందుకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయారు. పోలీసులే చట్టాన్ని చట్టుబండలు చేశారు.  


ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసుల నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. ఆ నోటా ఆ నోటా.. ఈ ఘటనకు సంబంధించిన విషయం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్దకు చేరింది.


ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో జరిగిన ఘటనను తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు  తీసుకోవాలని ఆదేశించారు. తక్షణమే నెల్లూరు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  అలాగే తండ్రి చేయాల్సిన పని కూతురుతో చేయించడంపైనా డీజీపీ సీరియస్ అయ్యారు. తండ్రి అయినప్పటికీ చట్టం ప్రకారం శిక్ష వేయిస్తామని తెలిపారు.


[[{"fid":"185765","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దీంతో చిన్నారి తండ్రి పైనా Child labour prohibition and regulation act 1986 ప్రకారం కేసులు నమోదు చేయాలని నెల్లూరు జిల్లా  పోలీసులను డీజీపీ ఆదేశించారు. మైనర్లతో పని చేయించిన వ్యక్తులకు కనీసం 3 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.  


అలాగే ఈ చట్టం పట్ల పోలీసులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు సిబ్బంది పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసు సిబ్బంది ఇక ముందు ఇలాంటి ఘటనలకు పాల్పడితే క్షమించేది లేదని స్పష్టం చేశారు. శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ వెళ్తామని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..