Mahesh Babu Phone Wallpaper: మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా? రాజమౌళి సినిమాకి రెడీ అయిపోయిన హీరో

Mahesh Babu: తాజాగా మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ లో చూడడానికి వెళుతుండగా ఎయిర్పోర్ట్లో కనిపించారు.. అయితే అక్కడ సడన్గా ఆయన మొబైల్ ఆన్ అవడంతో మొబైల్ వాల్ పేపర్ పైన ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది..

1 /6

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లడం తరచూ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి సినిమా కోసం భారీగానే ప్రిపేర్ అవుతూ ఉన్నారు మహేష్ బాబు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి పూజా కార్యక్రమాలు మొదలు కాకముందే మహేష్ బాబు తన లుక్ ని మొత్తం మార్చేస్తూ ఉన్నారు. 

2 /6

గతంలో ఎప్పుడూ లేనంతగా పొడువాటి జుట్టు,  గడ్డం పెంచేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి విదేశాలకు వెళుతున్న సమయంలో మహేష్ బాబు దగ్గర ఉండే మొబైల్ లోని వాల్ పేపర్ ఫోటో ఒకటి వైరల్ గా మారుతున్నది. 

3 /6

ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ వెళుతున్నటువంటి మహేష్ బాబు చేతిలో మొబైల్ సడన్ గా ఆన్ అయ్యింది. దీంతో మహేష్ బాబు మొబైల్ లో ఉండే వాల్ పేపర్ వైరల్ గా మారుతున్నది. అయితే మహేష్ బాబు వాల్ పేపర్ లో  గ్లోబ్ కనిపించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.. 

4 /6

అయితే ఈ ఫోటో SSMB -29 చిత్రం గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ మూవీ కనుక అందుకు సంబంధించిందే అయి ఉంటుంది అని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతోంది కాబట్టి ఈ చిత్రం కోసం మహేష్ బాబు పూర్తిగా అవతారాన్ని మొత్తం మార్చేశారు. అయితే మహేష్ బాబు ఫోటోల విషయంపై కూడా చాలా మీమ్స్ వినిపిస్తూ ఉన్నాయి.

5 /6

49 ఏళ్ళ వయసులో కూడా మహేష్ బాబు  స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారంటూ అభిమానులైతే కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా భార్య నమ్రత,  తన కూతురు సితారతో కలిసి మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ ను చూడడానికి వెళుతున్నట్లుగా సమాచారం.

6 /6

SSMB -29 సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కూడా ఇంకా తెలుపలేదు. కానీ ఇందులో చాలామంది నటీనటులు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు.