రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు సాధారణం. కానీ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తల సభ్యుల్లో కూడా అదే కన్పిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తలపై చర్చ పెరుగుతున్నట్టే..ఇందులోని ఫిరాయింపుదారులపై వివిధ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒకప్పుడు ఐ ప్యాక్ టీమ్ కీలక సభ్యుడిగా, ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీమ్ లీడ్‌గా ఉన్న శాంతను సింగ్ ఇప్పుడు ప్రత్యర్ది శిబిరంలో చేరాడు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. అతను ప్రత్యర్ధి పార్టీకు ఎంతవరకూ ప్లస్ అవుతాడనే చర్చ నడుస్తోంది. అసలింతకీ ఎవరా వ్యక్తి, ఏం జరిగింది


ఇతని పేరు శాంతను సింగ్. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్ సంస్థను వదిలి..ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ నడుపుతున్న షోటైమ్ కన్సల్టింగ్‌‌లో చేరాడు. 2024 ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మను టీడీపీ నియమించుకుంది. 


శాంతను సింగ్ నేపధ్యం


ఐఐటీ కాన్పూర్‌కు చెందిన శాంతను సింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్‌లో కీలకంగా ఉన్నాడు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం అనంతరం ఐ ప్యాక్‌లో కొద్దికాలం విరామం తీసుకుని..సింగపూర్ లీ కువాన్ య్యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు. సింగపూర్ నుంచి తిరిగొచ్చాక తిరిగి ఐ ప్యాక్‌లో చేరి..రెండు నెలల క్రితం వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలే చూశాడు.


ఎస్‌టీసీలో శాంతను సింగ్ చేరిక టీడీపీకు ప్రయోజనమా


ఐప్యాక్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ..తాజాగా శాంతను సింగ్ రాబిన్ శర్మకు చెందిన ఎస్‌టిసిలో చేరాడు శాంతను సింగ్. 2017 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్‌లో కీలకంగా వ్యవహరించడమే కాకుండా..అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్ధులకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్ రిపోర్ట్స్ తయారు చేయడంలో శాంతను సింగ్ పాత్ర కీలకం. అంటే ఇతని వద్ద ఉన్న కీలకమైన సమాచారం తెలుగుదేశం పార్టీకు చాలా చాలా ఉపయోగపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.


ఎస్‌టిసికు శాంతను సింగ్ ఎంతవరకూ ప్రయోజనం చేకూర్చనున్నాడనే విషయం రానున్న రోజుల్లో ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాల తరువాత తేలిపోనుంది. ప్రస్తుతం శాంతను సింగ్..ఎస్‌టిసిలో డైరెక్టర్ పదవిలో ఉన్నాడు. 


2019లో ఘోర పరాజయం అనంతరం టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు అతని కుమారుడు నారా లోకేష్ 2024 ఎన్నికల్లో విజయం కోసం ప్రొఫెషనల్స్ అవసరమని భావించారు. తెలుగుదేశం చాలాకాలం క్రితమే ఎస్‌టిసిని హైర్ చేసుకుంది. ఎస్‌టిసి సూచించిన బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. 


ఇప్పుడు రాబిన్ శర్మ జట్టులో శాంతను సింగ్ చేరడం టీడీపీకు వరమని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన కీలక సమాచారం అతని వద్ద ఉండటమే ఇందుకు కారణం. 


Also read: Pawan Kalyan: ఆ పని విచిత్రంగా ఉంది.. ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook