ఏపీ డీజీపిగా బాధ్యతలు స్వీకరించిన గౌతం సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఐపిఎస్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో చార్జ్ తీసుకున్న సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఐపిఎస్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో చార్జ్ తీసుకున్న సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సవాంగ్ 5వ డీజిపిగా వచ్చారు. అంతకన్నా ముందుగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసుల నుంచి సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర డీజీపిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైన వ్యవస్థ అని చెబుతూ అలాంటి వ్యవస్థకు నాయకత్వం వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తంచేశారు.