ఏపీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీగా సురేంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత ఎండీ మాలకొండయ్య నుంచి సురేంద్రబాబు ఏపీఎస్‌ ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, వైస్ ఛైర్మన్‌గా సురేంద్రబాబును నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..! అలాగే ఇప్పటివరకు అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న సురేంద్ర బాబుకు డైరెక్టర్ జనరల్ పదోన్నతి కల్పించారు. ఏపీ డీజీపీగా నియమించబడిన మాలకొండయ్యే ఇప్పటివరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఇన్ ఛార్జ్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టక ముందు సురేంద్రబాబు గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్లకు నాయకత్వం వహించేవారు. ఈయన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కఠినమైన, ముక్కుసూటి అధికారిగా పోలీసు సర్కిల్స్‌లో ఆయనకు పేరుంది. సురేంద్రబాబు ఎక్సైజ్, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్‌గా, హైదరాబాద్ అదనపు కమిషనర్‌గా, విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసలు తెచ్చిపెట్టాయి.