జనసేనకు గుడ్ బై చెబుతున్నారనే కామెంట్స్ పై  జననేన నేత లక్ష్మీనారాయణ స్పందించారు. ట్విట్టర్ వేధికగాపై ఆయన స్పందిస్తూ తనపై వస్తున్న ఈ వదంతుల గురించి తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ  ఓ నానాడిని ప్రస్తావించారు. గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తారు...మూర్ఖులు వాటిని వ్యాపింపజేస్తారు...తెలివి తక్కువ వ్యక్తులు వాటిని ఆమోదిస్తారు. తనపై పుకార్లు పుట్టించే వారు  ఏ కేటగిరీకి చెందుతారో వాళ్లే నిర్ణయించుకోవాలని చురకలు అంటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని అంత్యర్యం ఏంటి ?


జనసేన పార్టీకి  తాను ఎంత వరకు ఉపయోగపడతానని జనసేన చీఫ్ పవన్ భావిస్తారో అంత వరకూ ఆ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. దయచేసి... ఇలాంటి వదంతులను సృష్టించడం మాను కోవాలని హితవు పలికారు. ఇలాంటి అసత్య ప్రచారం చేసే బదులు... వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకో... మొక్కలు నాటేందుకో.. మరిన్ని మంచి పనులు చేసేందుకో సమయాన్ని వినియోగించు కుంటే బాగుంటుందని విమర్శకులు జనసేన నేత లక్షీ నారాయణ సూచించారు.



 


ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత  లక్ష్మీనారాయణ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటివలే పార్టీ కమిటీల్లో ఆయనకు స్థానం కల్పించకపోవడం వంటి పరిణామాలతో లక్ష్మీనారాయణ ఇక జనసేనకు గుడ్ బై చెబుతున్నారనే వదంతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన లక్ష్మీనారాయణ ఈ మేరకు వివరణ ఇచ్చారు