NTR VS YSR:  విజయవాడలోని ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసివేయడంపై ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రచ్చ సాగుతోంది. ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఇతర విపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై కొందరు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. పేరు మార్చడం పార్టీకి బాగా డ్యామేజీ చేసిందని.. అలా చేసి ఉండాల్సింది కాదని కొందరు కామెంట్ చేశారు. తాజా ఘటనతో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినపుడు వచ్చిన మైలేజీ మొత్తం పోయిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీకి మార్చడాన్ని ఏపీలోని మెజార్టీ వర్గాలు తప్పుపట్టినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హెల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరు మార్చడానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ఇది ఆషామాషీగా జరగలేదని పక్కా వ్యూహం ప్రకారమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పేరు మార్చడానికి అసలు కారణం యూనివర్శిటీ అధికారుల నిర్వాకమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టలేదట. యూనివర్శిటీలో ఎక్కడా ముఖ్యమంత్రి ఫోటో కనబడదని చెబుతున్నారు. సహజంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రుల ఫోటోలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రధానమంత్రి ఫోటో పెడతారు. ఇది ప్రోటోకాల్ కూడా. కాని ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవి చేపట్టి మూడేళ్లు దాటినా ఇప్పటివరకు హెల్త్ యూనివర్శిటీలో ఆయన ఫోటో పెట్టలేదట. ఇదే తాజా వివాదానికి అసలు కారణమంటున్నారు.


ప్రభుతాలు మారి కొత్త ముఖ్యమంత్రులు రాగానే ప్రభుత్వ కార్యాలయాల్లో పాతవి తీసువేసి  కొత్త సీఎం ఫోటోలు పెడుతుంటారు. 2019 జూన్ లో ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడే పాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను తొలగించిన యూనివర్శిటీ అధికారులు.. జగన్ ఫోటోను మాత్రం ఏర్పాటు చేయలేదు. 2019 డిసెంబర్ లోనే హెల్త్ యూనివర్శిటీలో సీఎం జగన్ ఫోటో పెట్టలేదనే వార్తలు వచ్చాయి. సీఎం జగన్ ఫోటో పెట్టాలని వర్శిటీ అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లిందట. అయినా వాళ్లు పట్టించుకోలేదని అంటున్నారు. హెల్త్ యూనివర్శిటీలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న కొందరు ఉద్యోగుల వల్లే ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది.  సొంత కులాభిమానంతోనే కొందరు అధికారులు ఈ విషయంలో మొండిగా వ్యవహరించారని చెబుతున్నారు. హెల్‌ యూనివర్శిటీలో పాలన మొత్తం కొందరి డైరెక్షన్ లోనే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.


ఎన్నిసార్లు చెప్పినా యూనివర్శిటీ అధికారుల తీరు మారకపోవడం వల్లే తాజాగా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందనే టాక్ వస్తోంది.  ఎన్టీఆర్ పేరు మార్చడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని ముందే ఊహించినా.. సీఎం జగన్ ముందుకే వెళ్లారని అంటున్నారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చిన జగన్ సర్కార్.. మొత్తం ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. హెల్త్ వర్శిటీలో సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన సిబ్బందిని అక్కడి నుంచి తప్పించనున్నారట. 


Also Read: GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!


Also Read: Bathukamma 2022 Date: బతుకమ్మను ఆడుదాం రండీ.. మట్టి ప్రజల పండగ విశేషాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook