Bathukamma 2022 Date: బతుకమ్మను ఆడుదాం రండీ.. మట్టి ప్రజల పండగ విశేషాలు..

Bathukamma 2022 Telugu Wishes: బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండగ. బతుకమ్మను ప్రతి సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 25(ఆదివారం) నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 09:16 AM IST
Bathukamma 2022 Date: బతుకమ్మను ఆడుదాం రండీ.. మట్టి ప్రజల పండగ విశేషాలు..

Bathukamma 2022 Telugu Wishes: బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండగ. బతుకమ్మను ప్రతి సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 25(ఆదివారం) నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటుంటారు. ఈ క్రమంలో మహిళలంతా బతుకమ్మ (గౌరి)ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.  ఈ పండగ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలును తెలుపుతుంది. అంతేకాకుండా గౌరి దేవిని ఒక్కొ రోజూ ఒక పేరుతో పిలుస్తారు. బతుకమ్మ పండుగను మరో పేరుతో సద్దుల పండుగ కూడా పిలుస్తారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈ పండగను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ పండగను చాలా మంది దసరాకు రెండు రోజుల ముందు జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దసర జరిగిన తర్వాత జరుపుకుంటారు. ముఖ్యంగా కరీంనగర్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో దసరా జరుపుకున్న తర్వాత ఈ సద్దుల బతుకమ్మను జరువుకోవడం ఓ ఆనావాయితని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పండగలో భాగంగా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొలా గౌరి మాతను పూజిస్తారు. అంతేకాకుండా నైవేద్యాలను కూడా ఒక్కొ ప్రాంతం వారు ఒక్కొ విధంగా పెడుతూ ఉంటారు. ఇది తెలంగాణ ప్రజలకు పెద్ద పండగా.. ప్రస్తుతం ఈ పండగను తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటున్నారు.

ఈ పండగను పూర్వీకులు దాదాపు 15 రోజుల పాటు జరుపుకునేవారు. పండగలో భాగంగా మహిళలంతా కోలాహలంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పటలు పడుతూ ఉంటారు. ఈ పండగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. అన్ని రంగుల కలయికలతో పేర్చిన పూలను తెలంగాణ ప్రజలంతా బతుకమ్మగా నమ్ముతారు. బతుకమ్మను తొమ్మది రోజుల్లో తొమ్మిది పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బతుకమ్మ 2022 తేదీలు, తొమ్మిది పేర్లు:
>>సెప్టెంబర్ 25- ఎంగిలి పువ్వు బతుకమ్మ
>>సెప్టెంబర్ 26- అటుకుల బతుకమ్మ
>>సెప్టెంబర్ 27- ముద్దపువ్వు బతుకమ్మ
>>సెప్టెంబర్ 28- నానా బియ్యం బతుకమ్మ
>>సెప్టెంబర్ 29- అట్ల బతుకమ్మ
>>సెప్టెంబర్ 30- అలిగిన బతుకమ్మ
>>అక్టోబర్ 1-  వేపకాయల బతుకమ్మ
>>అక్టోబర్ 2- వెన్నె ముద్దల బతుకమ్మ
>>అక్టోబర్ 3- సద్దుల బతుకమ్మ(చద్దుల బతుకమ్మ)

బతుకమ్మ 2022 కొటేషన్స్:
>>తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
>>అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
>>తెలుగింటి ఆడపడుచులకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
>>ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

బతకమ్మలను గుర్తు చేసే పాట:
>>ఒక్కొక్క వువ్వేసి ||చంద మామ||
>>ఒక జాము అయే ||చంద మామ||
>>రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
>>రెండు జాము లాయె ||చంద మామ||

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News