Attack on Varma: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మపై హత్యాయత్నం జరిగింది. పార్టీ కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చిన వర్మపై జనసైనికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో వర్మకు సంబంధించిన వాహనాలు, అనుచరులపై దాడులకు పాల్పడ్డారు. దాడిలో పది మందికి పైగా గాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిఠాపురంలో జరిగిన దాడిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. తనపై జరిగిన దాడిని ఆయన హత్యాయత్నంగా అభివర్ణించారు. తనను చంపే ఉద్దేశ్యంతోనే జనసేన కార్యక్రర్తలు దాడి చేసినట్టు చెప్పారు. ఈ దాడి చేసింది ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొందరు కార్యకర్తలని చెప్పారు. వీళ్లంతా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మనుషులని చెప్పారు. ఎదురుదాడి చేయడం చేతకాకకాదని, సంయమనం పాటిస్తున్నామన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తొలిసారి తనపై పిఠాపురంలో దాడి జరిగిందన్నారు. 


పార్టీ అదిష్టానం సూచనల మేరకే ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయలేద్న్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తనను చంపేందుకు రాళ్లు, కర్రలతో దాడులు చేశారన్నారు. దాడిలో తనకు సీసీ పెంకులు గుచ్చుకున్నాయన్నారు. టీడీపీ నుంచి జనసేనలో చేరిన 25 మంది తనపై ఉద్దేశ్యపూర్వకంగా తనను చంపేందుకు దాడి చేశారన్నారు. దాడి జరిగినప్పుడు వాహనంల మాజీ జెడ్పీటీసీలు, ముఖ్యనేతలున్నారు. పోలీసులు చర్యలు తీసుకునేవరకూ దాడికి గురైన వాహనాన్ని సెంటర్‌లో అలాగే లాక్ చేసి ఉంచుతానన్నారు. ఎన్ని దాడులు జరిగినా తాను భయపడేది లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. 


తనపై దాడి జరుగతుంటే పోలీసులు చోద్యం చూశారని వర్మ మండిపడ్డారు. మొత్తానికి వర్మపై దాడితో పిఠాపురంలో కలకలం రేగింది. తనను చంపేందుకే ఈ దాడి చేశారని వర్మ ఆరోపించడం మరింత చర్చనీయాంశమైంది. 


Also read: Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook