AP Capital:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. గురువారమే అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. పాలనా వికేంద్రీకరమే తమ విధానమని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. పాలనా వికేంద్రీకరణపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఏపీ సర్కార్ మూడు రాజధానుల దిశగా మళ్లీ అడుగులు వేస్తుందనే ప్రచారం సాగింది. అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టనున్నారనే చర్చ వచ్చింది. అయితే తాజాగా రాజధానుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానులపై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యన్నుత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని తన పిటిషన్ లో పేర్కోంది ఏపీ ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది.. హైకోర్టు తీరుపై ఏడాదిన్నర కాలంగా అప్పీల్ చేయని జగన్ సర్కార్.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాజధానిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని తెలిపింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తన పిటిషన్ లో వెల్లడించింది.


గతంలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ  విషయాన్ని అడ్వకేట్ జనరలే  హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మూడు రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ సందర్భంగా అఫిడవిట్  దాఖలు చేసిన ఏజీ.. అందులో రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు తాజాగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎలాగైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.


Read Also: Amit shah: హైదరాబాద్ లో కలకలం.. అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం.. కారు అద్దాలు పగలగొట్టిన ఎస్పీజీ  


Read Also: Johnson Powder Ban: జాన్సన్ బేబీ పౌడర్ తో ఇన్ ఫెక్షన్.. నిషేదం విధించిన మహారాష్ట్ర సర్కార్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి