Johnson Powder Ban: జాన్సన్ బేబీ పౌడర్ తో ఇన్ ఫెక్షన్.. నిషేదం విధించిన మహారాష్ట్ర సర్కార్

Johnson Powder Ban:కొంత కాలంగా జాన్సన్ బేబీ పౌడర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. జాన్సన్ పౌడర్ లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాన్సన్ బేబీ పౌడర్ పై నిషేదం విధించింది.

Written by - Srisailam | Last Updated : Sep 17, 2022, 11:18 AM IST
  • జాన్సన్ బేబీ పౌడర్ తో ఇన్ ఫెక్షన్
  • నిషేదం విధించిన మహారాష్ట్ర
  • గతంలోనే బ్యాన్ చేసిన అమెరికా, కెనడా
Johnson Powder Ban: జాన్సన్ బేబీ పౌడర్ తో ఇన్ ఫెక్షన్.. నిషేదం విధించిన మహారాష్ట్ర సర్కార్

Johnson Powder Ban: జాన్సన్ బేబీ పౌడర్.. ఈ పేరు తెలియని వారుండరు. దేశంలోని కోట్లాది ఇళ్లలో ఇది కంపల్సరిగా ఉంటుంది.  తమ పిల్లల కోసం జాన్సన్ బేబీ పౌడర్ ను దశాబ్దాలుగా వినియోగిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే కొంత కాలంగా జాన్సన్ బేబీ పౌడర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. జాన్సన్ పౌడర్ లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాన్సన్ బేబీ పౌడర్ పై నిషేదం విధించింది. జాన్సన్ బేబీ పౌడర్ తో సమస్యలు వస్తున్నట్లు గుర్తించామని మహారాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. జాన్సన్ పౌడర్ వాడితే చర్మంపై ఇన్ ఫెక్షన్ వస్తుందని తెలిపింది.

గతంలోనూ జాన్సన్ బేబీ పౌడర్ పలు ఆరోపణలు వచ్చాయి. జాన్సన్ బేబీ పౌడర్‌ కారణంగా క్యాన్సర్‌ వ్యాపిస్తుందని కొందరు ఫిర్యాదు చేశారు. ఈ పౌడర్‌లోని ఆస్‌బెస్టాస్‌ అవశేషాలు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయని కొందరు బాధితులు కోర్టులను కూడా ఆశ్రయించారు. పలు కోర్టులు బాధితులకు సానుకూలంగా తీర్పులిచ్చాయి. కోర్టు తీర్పులతో 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకుపైగా పరిహారం కూడా అందించింది జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.  జాన్సన్‌ బేబీ పౌడర్ ను 2020లోనే అమెరికా నిషేదించింది. కెనడాలో బీబీ పౌడర్‌ అమ్మకాలపై బ్యాన్ వేధించారు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలతో జాన్సన్ కంపెనీ కూడా గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ పౌడర్‌ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది. 2023 నాటికి టాల్క్‌ ఆధారిత బేబీ పౌడర్‌ విక్రయాలను నిలిపివేస్తామని ప్రకటించింది. కార్న్‌స్టార్చ్‌ ఆధారిత బేబీ పౌడర్‌ పోర్ట్‌ఫోలియోకు మారబోతున్నట్లు జాన్సన్ వెల్లడించింది. జాన్సన్ బేబీ పౌడర్ ను  1894 నుండి విక్రయిస్తున్నారు. 1999 నుండి బేబీ ఉత్పత్తుల విభాగంలో టాప్ గా నిలిచింది.  జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల్లో ఎక్కువ రాబచి తెచ్చేది  బేబీ పౌడరే.

Read Also: Lock Down: మూడేళ్లుగా లాక్ డౌన్ లో కుటుంబం.. స్నానం చేయకపోవడంతో దుర్వాసన! అనంతపురంలో దారుణం

Read Also: Hyderabad Liberation day: విలీనమా.. విమోచనమా.. విద్రోహమా? సెప్టెంబర్‌ 17న అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News