Glass Symbol Issue: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గట్టిగానే గుచ్చుకునేలా కన్పిస్తోంది. గాజు గ్లాసు కామన్ సింబల్ కాకపోవడంతో జనసేన బరిలో లేని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయంలో ఇది ఇబ్బందికరంగా మారనుండటంతో జనసేన పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ నిన్న ఏప్రిల్ 29తో ముగియడంతో అభ్యర్ధులకు గుర్తు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జనసేన అభ్యర్ధులు బరిలో లేని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించింది. గాజు గ్లాసు కామన్ సింబల్ కాకపోవడంతో నిబంధనల ప్రకారమే చేసినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు, రెబెల్ అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తుగా కేటాయించింది. ఇది రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ అభ్యర్ధులు పోటీ చేసే 154 నియోజకవర్గాలపై ప్రభావం పడనుంది. ఎందుకంటే వీటిలో అత్యధిక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు దక్కింది. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముండటంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఇతర అభ్యర్ధులకు గాజు గ్లాసు కేటాయించవద్దని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. 


ఈ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అటు తెలుగుదేశం కూడా అనుబంధ పిటీషన్ దాఖలు చేసింది. ఈ విషయంపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. 


Also read: Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook