Pawan Kalyan: కౌలు రైతులకు అండగా పవన్... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం...
Pawan Kalyan for Farmers: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డ 150 మంది రైతులకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan for Farmers: ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించారు. రైతులకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన పరిహారం కోసం పోరాడుతూనే... తమవంతుగా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డ 150 మంది రైతులకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతలో కొంతైనా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
'ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణ అంటున్నామంటే దానికి కారణం కౌలు రైతులు. ఇవాళ మనం తినే 80 శాతం తిండి గింజలు కౌలు రైతుల కష్టం నుంచే వస్తున్నాయి. ఇలాంటి కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి దక్కిన బహుమతి 3 వేల చావులు. గిట్టుబాటు ధరలు లేక, సొంత భూమి లేక.. అర ఎకరం, రెండెకరాల్లో అప్పు చేసి మరీ వ్యవసాయం చేస్తే కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. రైస్ మిల్లర్స్, దళారులు కలిసి రైతులను దగా చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 వేల మంది రైతులు చనిపోయారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే 80 మంది చనిపోయారు. వాళ్లకు ఇస్తామన్న పరిహారం ఇప్పటికీ ఇవ్వట్లేదు.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఏమైనా అంటే వైసీపీ నేతలు తమపై విరుచుకుపడటం తప్ప రైతులకు అండగా నిలబడే పరిస్థితి లేదన్నారు. అధికారిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని పేర్కొన్నారు. అనధికారికంగా ఆ సంఖ్య 45 లక్షలు వరకు ఉండొచ్చు అన్నారు. గోదావరి జిల్లాల్లోనే 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేంతవరకూ పోరాడుతామని తెలిపారు. దయచేసి కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Tiger Nageswara Rao: రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'.. లాంచ్ చేసిన చిరంజీవి...
SRH Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరసన.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్ 'క్యాచ్' పంచాయతీ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.