SRH writing a letter to BCCI against Kane Williamson Catch Out: ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) నిరసనకు దిగింది. సన్‌రైజర్స్ జట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లేఖ రాసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్‌పై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై బీసీసీఐని అప్రోచ్ అయింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూటీ ఖరారు చేశారు.
రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై పెద్ద దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేన్ మామ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే ఈ క్యాచ్ గ్రౌండ్‌ను తాకిందని సన్‌రైజర్స్ టీమ్ వాదిస్తోంది.
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన హైపిచ్ బంతిని కేన్ విలియమ్సన్ డిఫెన్స్ చేశాడు. అయితే బంతి కుడివైపు స్లిప్స్‌లో గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ సంజు శాంసన్ కుడివైపు డైవ్ చేసినప్పటికీ బంతిని అందుకోలేకపోయాడు. తొలుత అతని గ్లోవ్స్‌కు తాకిన బంతి మళ్లీ గాల్లోకి లేవగా.. స్లిప్స్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. అతడి చేతుల్లోకి వెళ్లకముందే ఆ బంతి గ్రౌండ్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దీన్ని సన్‌రైజర్స్ టీమ్ ఖండిస్తోంది. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాసింది.
వీడియో క్లిప్స్, వివిధ కోణాల్లో నుంచి తీసిన ఫొటోలను లేఖకు జత చేస్తూ.. తమ కెప్టెన్ కేన్ ఔట్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎస్‌ఆర్‌హెచ్ లేఖలో పేర్కొంది. థర్డ్ అంపైర్ నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యుడైన అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద క్యాచ్‌ల విషయంలో రూల్స్‌ను కూడా సవరించాలని కూడా ఎస్‌ఆర్‌హెచ్ కోరింది. తాము లేఖ రాసిన విషయాన్ని సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ నిర్ధారించారు.
Also Read: Andre Russell: బంతి చాలా ఎత్తుకు ఎగరడం చూసి చాలా కాలమైంది.. రసెల్ ఆటకు షారుఖ్ ఖాన్ ఫిదా!!
Also Read: Omicron XE Variant: ఇది మరీ ప్రమాదకరమా..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.