Pawan Kalyan: `పాపం పసివాడు..` అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్
Pawan Kalyan Counter to CM Jagan Mohan Reddy: సీఎం జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రితో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సినిమా పోస్టర్లో చిన్న మార్పు చేయాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.
Pawan Kalyan Counter to CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నా.. పొలికల్ కామెంట్స్‌తో హీటెక్కుతోంది. టీడీపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలకు పదునుపెట్టారు. దత్తపుత్రుడు, దత్తతండ్రి మ్యాచ్ ఫిక్సింగ్స్ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత వేడి పెరిగింది. ఈ కామెంట్స్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్‌గా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. 'పాపం పిసివాడు..' సినిమా పోస్టర్ ట్వీట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఎవరైనా తీస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతని చేతిలో 'సూట్‌కేస్'కి బదులుగా తన అక్రమ సంపాదనను సుగమం చేసే మనీ లాండరింగ్ కోసం పెట్టుకున్న 'సూట్‌కేస్ కంపెనీలను' ఉంచండి. ఏపీ సీఎం గారూ.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారో, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారో కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో.. వర్గ పోరు (క్లాస్ వార్) అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ బ్యాచ్ నుంచి ‘రాయలసీమ’ విముక్తమవుతుందని ఆశిస్తున్నాను.
PS: ఈ కథకు రాజస్థాన్ ఎడారులు కావాలి. కానీ వైసీపీ మన ఏపీలో నదీ తీరాల నుంచి ఇసుక దోచేసింది. కలెక్షన్ పాయింట్లలో తగినన్ని ఇసుక దిబ్బలు ఉన్నాయి. ఛీర్స్!!" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ట్వీట్‌పై కాంట్రవర్సీ కింగ్ రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. "మీరు అజ్ఞానంగా అమాయకంగా ఉన్నందున ఎవరైనా మీతో కూడా ఈ సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. ఒక పాత్రను పోషించే బదులు.. ఒక పాత్రలోనే అన్ని క్యారెక్టర్లు ఉండేలా చూసుకోండి. పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్టీఆర్ కాదు.. ఎంజీఆర్ కాదు.. మీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు.. మీకున్న దురుద్దేశంతో మీ అమాయక అభిమానులను రెచ్చగొట్టే హింసను ప్రేరేపిస్తున్నారు. ఏదో ఒక రోజు మీ జన సైనికులకు మీ నుంచి.. మీ మానసిక నార్సిజం నుంచి విముక్తి పొందుతారని నేను నమ్ముతున్నాను.
PS: ఈ కథనానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దిబ్బలు కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోచుకోవడానికి అబద్దాలు విసరడానికి మీకు హైదరాబాద్ కావాలి. ఎందుకంటే కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్‌లలో మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నారు. చీర్స్.." అని రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Also Read: UPI Payments: యూపీఐ నుంచి పొరపాటున ఇతరులకు డబ్బు పంపించారా..? సింపుల్‌గా ఇలా తిరిగి పొందండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి