Bhuma Akhila Priya Reddy Arrest: టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్

High Tension in Nandyal: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలో నంద్యాలలో హైటెన్షన్ నెలకొంది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 17, 2023, 10:56 AM IST
Bhuma Akhila Priya Reddy Arrest: టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్

High Tension in Nandyal: నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు. లోకేష్‌కు యాత్ర సందర్భంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో.. ఆమె అనుచరుడు సుబ్బారెడ్డిని కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

భూమా అఖిలప్రియ అరెస్ట్‌తో నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అఖిల ప్రియ తన బిడ్డతోనే పాణ్యం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆమెతోపాటు భర్త భార్గవ్ రామ్, పీఏ మోహన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డిపై కూడా అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరిముందే ఆయన తన చున్నీ పట్టుకుని లాగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అఖిల ప్రియ అరెస్ట్‌తో ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది.  

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో ముగిసింది. నంద్యాల నియోజకవర్గంలో ఎంట్రీ సందర్భంగా టీడీపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. భూమా అఖిల ప్రియ వర్గం.. ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు పోటాపోటీగా స్వాగతం పలికేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో అఖిల ప్రియ అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశాడు. వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. 

భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తమే కాదు. 2019 ఎన్నికల సందర్భంలో కూడా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. మూడేళ్ల హత్యకు కుట్ర జరగ్గా.. పోలీసులు పసిగట్టి కుట్రను భగ్నం చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి విచారించగా.. అఖిల ప్రియ సుఫారీ ఇచ్చారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న రెండు వర్గాలు.. నారా లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా మరోసారి రచ్చకెక్కారు. వీరిద్దరి మధ్య వివాదానికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగినట్లు సమాచారం. 

Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..  

Also Read: UPI Payments: యూపీఐ నుంచి పొరపాటున ఇతరులకు డబ్బు పంపించారా..? సింపుల్‌గా ఇలా తిరిగి పొందండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News