Pawan Kalyan on CM Jagan: అన్నమయ్య డ్యామ్ మట్టికట్ట తెగి.. భారీగా సంభవించిన వరదలతో 33 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ఘటన జరిగి మూడేళ్లయినా ప్రభుత్వం ఆదుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ మోహన్ రెడ్డికే ఎరుక అని కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యామ్ మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు.
 
ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాం.. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో.. ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక.


అన్నమయ్య డ్యామ్‌ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పారు.


కేంద్ర జలవనురుల శాఖ మంత్రి శకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు." అని పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.



 



Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?  


Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి