Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?

Amazon Hikes Sellers Fees:     అమెజాన్‌లో వివిధ రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి. విక్రయదారుల ఫీజు, కమీషన్‌ ఛార్జీలను పెంచడంతో మే 31వ తేదీ నుంచి ధరలు పెరగనున్నాయి. గతంలో చెల్లించాల్సిన డబ్బులు కంటే.. ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 18, 2023, 10:34 AM IST
Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?

Amazon Hikes Sellers Fees: ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌కు భారీ డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు. అయితే అమెజాన్‌లో షాపింగ్ చేస్తున్న కస్టమర్లకు త్వరలోనే బ్యాడ్‌న్యూస్ రాబోతుంది. మే 31వ తేదీ తరువాత అమెజాన్‌లో పలు వస్తువులపై ధరలు పెరగనున్నాయి. అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి షాపింగ్‌పై బంపర్ తగ్గింపు ప్రయోజనాన్ని పొందేవారు. కానీ ఇప్పుడు మీరు షాపింగ్ కోసం ఎక్కువ చెల్లించాలస్సి ఉంటుంది. 

అమ్మకందారుల ఫీజు, కమీషన్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు ఇటీవల అమెజాన్ ప్రకటించింది. దీంతో పలు ప్రొడక్ట్‌ల ధరలు పెరగనున్నాయి. అయితే అన్ని ఉత్పత్తులపై ధరలు పెరగడం లేదు. ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్ ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫీజు, కమీషన్ పెంపుతో అమెజాన్‌లో లభించే వస్తువులు ఖరీదైనవిగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. అమ్మకందారులు తమ భారాన్ని కస్టమర్‌పై మోపే అవకాశం ఉంది. పెరిగిన ఛార్జీలు మే 31 నుంచి అమలులోకి రానున్నాయి. 

బట్టలు, సౌందర్య ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, మందులతో సహా అనేక ప్రొడక్ట్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు ఏదైన నచ్చిన వస్తువు రీఫండ్ విషయంలో ప్లాట్‌ఫారమ్ ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంది. రూ.500 లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తులపై ఓవర్ ది కౌంటర్ ఔషధాల విక్రయదారుల ఫీజును 5.5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని నిర్ణయించింది అమెజాన్. అదేసమయంలో రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఉత్పత్తులపై ఈ రుసుము 15 శాతానికి పెంచారు. అమెజాన్ వాల్ పెయింట్, టూల్స్, ఇన్వర్టర్లు, బ్యాటరీల వంటి కొన్ని వర్గాలకు కూడా ఈ రేట్లను తగ్గించింది. 

Also Read: Bhuma Akhila Priya Reddy Arrest: టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్  

Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x