Pawan Kalyan Speech In Janasena Yuvashakti: మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఆటీన్ రాజులు.. డైమండ్ రాణీలు బాగా తెలుసు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మూడు ముక్కలాట.. గాంబ్లింగ్ మీద మంచి పట్టున్న ఈ ముఖ్యమంత్రికి ఆ ముక్కల పద్దతి వదలడం లేదని విమర్శించారు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారాయి కింద పట్టుకుపోతాననే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రిని నమ్మొద్దన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి కంటే గొప్పగా పథకాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క పథకం కూడా తీసేయమని అన్నారు. ఉత్తరాంధ్రను వలసల రాజధాని కాదు.. ఆర్థిక రాజధానిగా చేస్తామని తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో ఆయన మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు నటనలో ఓనమాలు నేర్పింది ఉత్తరాంధ్రేనని అన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర ఆట, పాట, కవిత, కళ, తనకు నటన నేర్పిన గురువు అని అన్నారు. సినిమాల్లోకి వెళ్లినా అనుక్షణం తన మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించి, ఉద్యోగం ఉపాధి లేని యువత గురించే ఆలోచించిందని అన్నారు. ఈ రోజున ప్రతి ఎదవ చేత, సన్నాసి చేత, మాటలు అనిపించుకుంటున్నా తనకు బాధ లేదని.. ఈ సన్నాసులు రాజకీయాల్లోకి రాకముందు తన పక్కన నిల్చుని ఫోటోలు కూడా తీయించుకున్నారని గుర్తుచేశారు. మీ కోసం పోరాటం చేసి అలాంటి ఎదవలతో తిట్టించుకోవడాన్ని విజయంగానే భావిస్తానని అన్నారు. 
 
'దేశభక్తి.. రాజ్యాంగం.. దేశానికి సంబంధించిన విధులు.. సామాజిక బాధ్యతలు అంటూ పుస్తకాల్లో చెప్పిన రాజకీయ నాయకులు బయటికి వచ్చి బాధ్యత లేకుండా మాట్లాడతారు. అధికారంలో కూర్చోగానే మనం వారి బానిసల్లాగా చూసే వ్యక్తిత్వాలు నాకు చిరాకు కలిగించాయి. సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు తీర్చేయొచ్చు. నిజ జీవితంలో ఉద్దానం సమస్య ఇప్పటికీ తీర్చలేదు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర ఎవరూ లేదు. ఇంత సమూహం నా వెంట ఉంటారని తెలియదు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అందరిలాగా మెటికలు విరుస్తూ కూర్చోవాలా.. నా దేశం కోసం సమాజం కోసం ముందుకు రావాలా.. అని ఆలోచించినప్పుడు మహా అయితే నా ప్రాణం పోతుంది. 


కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతాను అనిపించింది. నాకు పిరికితనం చిరాకు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా..? అన్న సిద్ధాంతాన్ని పాటించే వాడిని. మొన్న టిడ్కో ఇళ్ల గురించి విజయనగరం వస్తే యువత మాట్లాడేందుకు భయపడుతున్నారు. కోపం ఉంది కానీ భయం ఉంది. ఈ రాజకీయ నాయకులు ఏమైనా దిగి వచ్చారా..? మనలా వారికి రక్తమాంసాలే ఉన్నాయి. మనం ఒక దెబ్బ కొడితే వారికి తగులుతుంది.


ఎంత కాలం శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతం అనిపించుకుంటాం.. ఎంత కాలం 50 శాతం వలసలు వెళ్లిపోతారు. రాజకీయ నాయకులెవరూ దీని గురించి మాట్లాడరు. నేను నిలబడదాం అంటే నాకు తోడుగా ఎవరూ నిలబడలేదు. బలంగా ఒక శాతం మాత్రమే నిలబడ్డారు. కానీ అది చట్ట సభల్లో ఎదిరించి నిలబడేంత సత్తా ఇవ్వలేదు. అయినా నేను  నీరసపడిపోలేదు. అవమానపడలేదు. రెండు చోట్ల ఓడావని కించపరుస్తుంటే యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను. రణస్థలంలో మాటిస్తున్నా నా కడశ్వాస వరకు నేను రాజకీయాల్ని వదలను. 


మిమ్మల్ని వదలను.. దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే అతన్ని పార్టీ బాగా చూసుకోవాలి. లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ మేము పూర్తి స్థాయి రాజకీయ నాయకులంటే ఎలా..? కపిల్ సిబల్, చిదంబరం లాంటి వాళ్లు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయం చేస్తారు. నేను సినిమాలు చేయాలి. నాకు వేరే దారిలేదు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్లి కాంట్రాక్టులు చేయలేను. కాంట్రాక్టులు చేస్తే పర్లేదు గాని.. సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తే కుదరదు అంటే ఎలా..? నా పని నేను చేసుకుంటూ నా వంతు సమాజానికి నేనిచ్చే సమయం ఇది. డబ్బు అవసరం లేని రోజు వస్తే సినిమాలు వదిలేస్తా..' అని పవన్ కళ్యాణ్‌ అన్నారు. 


Also Read:  Pawan Kalyan on Alliances: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఆ గ్యారెంటీ ఇస్తే పొత్తులు ఉండవట!


Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి