Virat Kohli Vs Hardik Pandya: స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 87 బంతుల్లో 113 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గురువారం రెండు జట్ల మధ్య రెండో వన్డే జరగబోతుంది. అయితే తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది.
గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. టీమిండియా వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకుంటోంది. సెలబ్రేషన్లో హార్దిక్ పాండ్యా అందరికీ 'హై ఫైవ్' చేస్తూ.. విరాట్ కోహ్లీ పక్కనే ఉన్నా పట్టించుకోలేదు.
ఇతర ప్లేయర్లకు హై ఫైవ్ ఇస్తూ.. చేతిని కోహ్లీ తలపై కొట్టాడు. దీంతో కోహ్లీ టోపీ కూడా పక్కకు జరిగిపోయింది. కొంచె చూసుకో అంటూ విరాట్ కోహ్లీ సైగ చేశాడు. అయినా హార్దిక్ పాండ్యా అతనిని పట్టించుకోలేదు. కోహ్లీతో మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అయితే హార్దిక్ పాండ్యా ఇదంతా సరదాగా చేశాడా.. లేక సీరియస్‌గా ఉన్నాడా అనే విషయంపై క్లారిటీ లేదు.
అంతకుముందు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లోనే 43వ ఓవర్లో శ్రీలంక బౌలర్ కసున్ రజిత వేసిన ఓవర్ మూడో బంతికి కోహ్లి స్లోయర్ కట్టర్ బాల్‌ను.. లైట్ హ్యాండ్‌తో ఆడి పరుగు తీసేందుకు పరుగెత్తాడు. బంతి స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. రెండో పరుగు తీసుకోవడానికి కోహ్లీ సగం పిచ్‌కు చేరుకున్నాడు. కానీ పాండ్యా అతనిని చూడలేదు. రెండో పరుగు తీసేందుకు నిరాకరించాడు. సగం పిచ్ వరకు వచ్చిన కోహ్లీ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. అనంతరం పాండ్యా వైపు కాస్త కోపంగా చూసి.. తల దించుకున్నాడు. ఇందుకు సంబధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అందుకే ఫీల్డింగ్ సమయంలో హార్ధిక్ పాండ్యా అలా చేశాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
— Guess Karo (@KuchNahiUkhada) January 10, 2023
Also Read: Ind Vs SL: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!
Also Read: Chiranjeevi Vs Balakrishna: 9 సార్లు సంక్రాంతికి బాలయ్య-చిరు పోటీ.. ఎవరెన్ని హిట్లు కొట్టారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి