Pawan Kalyan Supports to Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది.  మూడోరోజు ఆయన అనపర్తి దేవీచౌక్‌ సెంటర్‌లో పర్యటిస్తుండగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బలభద్రాపురం నుంచి బాబు కాన్వాయ్‌ అనపర్తి పట్టణంలోకి రాకుండా నిలిపివేశారు. పోలీసు కానిస్టేబుళ్లు రోడ్డుపై కూర్చొగా.. చంద్రబాబు కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తికి బయలుదేరారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. నిన్న అనుమతి ఇచ్చి.. ఇవాళ ఎలా రద్దు చేశారంటూ ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు అండగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదంటూ ఫైర్ అయ్యారు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని అన్నారు. 


'ఈ రోజు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు గారిని అడ్డుకొనేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి..? ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నాం. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయి.


జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో  ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారు. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారు. నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలుపెట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది..? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని అర్థమవుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని ఈ పాలకులు తెలుసుకోవాలి. 


Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి  


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook