Janasena: నేడు పవన్ కల్యాణ్ సమావేశం
Janasena Party Chief Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం విదితమే.
Janasena Party Meeting | ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం విదితమే. అందులో భాగంగా శనివారం, రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా తుపాను వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి పంటలను చూశాడు. అదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!
నివర్ తుపాను (Nivar) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది.
రేణిగుంట చేరుకున్న తరువాత సాయంత్రం 4 గంటలకు తిరుపతి లోని విహాస్ హోటల్ లో ప్రెస్ మీట్ అటెండ్ అవుతారు అని సమాచారం. అనంతరం చిత్తూరు (Chittoor) జిల్లా పార్టీ కీలక నేతలతో సమావేశం అవుతారని సమాచారం. సోమవారం, మంగళవారం వరకు ఈ పర్యటన కొనసాగుతుంది.
Also Read | భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe