Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..
Pawan Kalyan Varahi Vehicle Pooja: వారాహి వాహనానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం వారాహి నుంచి తొలి పలుకులుగా `జై భవానీ` అంటూ పలికారు. ఈ సందర్భంగా వాహనంపై నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
Pawan Kalyan Varahi Vehicle Pooja: రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులను బుధవారం తీసుకొని అనంతరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి నుంచి తొలి పలుకులుగా 'జై భవానీ' అంటూ అమ్మవారి పేరు భక్తిపూర్వకంగా స్మరించారు.
అనంతరం ప్రసంగిస్తూ.. రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. కచ్చితంగా వారాహితో త్వరలోనే ప్రజలను కలుసుకుంటాను అన్నారు. వారాహి వాహనం పూజల్లో తమకు సహకరించిన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు, అర్చకులు, పోలీసులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు పవన్ తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని పవన్ కళ్యాణ్‌తోపాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వేళ నేరుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని.. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. పవన్‌కు ఆలయం మర్యాదలతో ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకున్న జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగేలా దుర్గమ్మ ఆశీర్వదించాలని వేడుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
పూజలు అనంతరం వారాహి వాహనంపైకి ఎక్కి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు పవన్ కళ్యాణ్. కనకదుర్గమ్మ ప్లై ఓవర్ నుంచి అభిమానులు జనసేనానిపై పూల వర్షం కురిపించారు. డప్పు చప్పుళ్లు, బాణ సంచా పేలుళ్లతో విజయవాడ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గమ్మ ఆలయం బయట ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
వారాహిలో మంగళగిరి కార్యాలయానికి బయలుదేరగా.. జనసేన వీర మహిళలు వంద బిందెలతో నీళ్లు పోసి స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో వారాహిపై నుంచి అభిమానులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. సీతమ్మ పాదాల దగ్గర 108 అంబులెన్స్ సైరన్ వినగానే.. తన వాహన శ్రేణిని పవన్ నిలిపివేయించారు. వెంటనే 108కి దారి ఇప్పించి ముందుకు పంపించారు. అనంతరం అక్కడి నుంచి మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు.
Also Read: Balakrishna Sorry: సారీ చెప్పడానికి రెడీగా లేని బాలయ్య.. విషెస్ చెప్పాడు కానీ?
Also Read: Nagachaitanya Movie: పరశురామ్ కి హ్యాండిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook