MODI PAWAN MEET: ఏపీ పరిస్థితులపై ప్రధానికి పవన్ రిపోర్ట్.. వైసీపీ, బీజేపీలో హై టెన్షన్?
MODI PAWAN MEET: ప్రధాన మంత్రితో డేగ సర్కార్ చోళ లో పవన్ భేటి ఉండనుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, తాజా రాజకీయాలపై 30 నిమిషాలపాటు చర్చించే అవకాశముందని సమాచారం. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీలో కొందరు నేతల వైఖరిని ప్రధానికి పవన్ వివరిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి
MODI PAWAN MEET: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాని మోడీతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశం కానుండటం రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతోంది. ప్రధాని మోడీ కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం వచ్చింది. .శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖలో అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో శుక్రవారం మధ్యహ్నానానికే విశాఖ చేరుకోనున్నారు పవన్ కల్యాణ్. పవన్ కోసం బీజేపీనే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు జన సేన చీఫ్. అయితే ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ సమావేశం శుక్రవారం ఉంటుందా శనివారం ఉంటుందా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. శుక్రవారం రాత్రి గాని లేదంటే శనివారం ఉదయం ప్రధాని మోడీతో జనసేన చీఫ్ సమావేశం ఉంటుందని చెబుతున్నారు.
శుక్రవారం రాత్రి ఏపీ బీజేపీ కోర్ కమిటీతో ప్రధాని భేటీ సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత సమయాన్ని బట్టి పవన్ తో మోడీ భేటీ ఉంటుందని తెలుస్తోంది. ప్రధాన మంత్రితో డేగ సర్కార్ చోళ లో పవన్ భేటి ఉండనుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, తాజా రాజకీయాలపై 30 నిమిషాలపాటు చర్చించే అవకాశముందని సమాచారం. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీలో కొందరు నేతల వైఖరిని ప్రధానికి పవన్ వివరిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. శనివారం జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు పవన్ హాజరయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక శుక్రవారం విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనేదానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రధాని పర్యటన కోసం వైసీపీ, బీజేపీ పోటాపోటీ ఏర్పాట్లు చేస్తున్నాయి. దాదాపు మూడు లక్షల మందితో సభకు అధికార వైసీపీ ప్లాన్ చేస్తోంది. మోడీ రోడ్ షోకు బీజేపీ భారీగా జనసమీకరణ చేస్తోంది. మొత్తంగా ప్రధాని మోడీ విశాఖ పర్యటనతో ఏపీలో పొత్తు రాజకీయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే టాక్ వస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన పొత్తు కుదిరిందనే ప్రచారం సాగుతోంది. పవన్ కు మద్దతుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం జనసేన, బీజేపీనే కలిసి పోటీ చేస్తాయని.. టీడీపీతో కలిసిపోయే ప్రసక్తే లేదంటున్నాయి. విశాఖలో జరిగే ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ సమావేశంలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : Rohit Sharma: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోర పరాభవం.. ఓటమికి రోహిత్ శర్మ చెప్పిన కారణం ఏంటో తెలుసా?
Also Read : Rohit Sharma in Ind vs Eng: రోహిత్ శర్మకు, హార్థిక్ పాండ్యకు కోపం తెప్పించిన షమీ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook