జనసేనకు సరికొత్త రూపం; పార్టీ అత్యున్నత కమిటీలు ఏర్పాటు !!
ఎన్నికల ఫలితాల అనంతరం మౌనంగా వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ పటిష్టానికి నడుం బిగించారు
గత ఎన్నికల్లో ఘోర వైఫల్యం చూసిన జననేన పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురు సభ్యలతో పొలిట్‌బ్యూరోను నియమించారు. ఇదే క్రమంలో 12 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
పొలిట్‌బ్యూరోలో నాదెండ్ల మనోహర్, పి. రామ్మోహన్‌రావు, రాజు రవితేజ్, అర్హం ఖాన్‌లకు చోటు కల్పించారు. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను నియంచగా ... తోట చంద్రశేఖర్, కొణిదెల నాగబాబు, రాపాక వరప్రసాద్, కందుల దుర్గేష్, ముత్తా శశిధర్, కోన తాతారావు, పాలవలస యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, ఎ. భరత్ భూషణ్, మనుక్రాంత్ రెడ్డి, బి. నాయకర్‌లు తదితరులను సభ్యులుగా నియమించారు.
సభ్యుల ఎంపిక గురించి ట్విటర్ వేదికగా జనసేన పార్టీ స్పందించింది. నాయకత్వ సామర్థ్యం... బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారికే కమిటీల్లో స్థానం కల్పించినట్లు అధికార ట్విట్టర్ లో పేర్కొంది. భవిష్యతుల్లో మరింత సమర్థవంతంగా ప్రజా సమస్యలపై పోరాడామని జసనేన పార్టీ ప్రకటించింది.