NDA Meeting: ఢిల్లీ నుంచి పిలుపు, ఈ నెల 17న వెళ్లనున్న పవన్ కళ్యాణ్
NDA Meeting: ఎన్డీయే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ఎన్డీయే సమావేశానికి హాజరుకావల్సిందిగా ఆహ్వానం అందింది. ఫలితంగా వారాహికి బ్రేక్ పడనుంది.
NDA Meeting: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల భేటీ ఢిల్లీలో జరగనుంది. పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న వివిధ బిబ్లులకు మద్దతు కోరడం, రానున్న ఎన్నికలకై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బల ప్రదర్శన లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.
జూలై 18 వతేదీన ఢిల్లీలో ఎన్డీయే భాగస్యామ్య పార్టీల సమావేశం జరగనుంది. ఢిల్లీ అశోక హోటల్‌లో జరగనున్న ఈ భేటీకు పాత కొత్త మిత్రుల్ని బీజేపీ పిలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా శిరోమణి ఆకాలీధళ్ పార్టీకు సైతం ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. అదే సమయంలో టీటీపీ అధ్యక్షుడు చంద్రబాబుని కూడా ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆహ్వానం అందితే మాత్రం చంద్రబాబు నాయుడు కచ్చితంగా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎన్డీయే మిత్రపక్షం జనసేన పార్టీకు ఇప్పటికే ఆహ్వానం అందింది.
ఆ పార్టీ తరపున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. ఈ ఇద్దరు నేతలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఢిల్లీ చేరుకుని, 18వ తేదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరుకానున్నారు. అంటే రెండ్రోజులపాటు వారాహి యాత్రకు బ్రేక్ పడనుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకు చెందిన హిందూస్తాన్ అవామ్ మోర్చా ఇటీవలే నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా ఘట్ బంధన్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్డీఏలో చేరింది. మరోవైపు మహారాష్ట్రలో జరిగిన పరిణామాలతో ఎన్సీపీ వర్గం అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్డీయేలో చేరింది. కర్ణాటకలో జేడీఎస్ -బీజేపీ బంధం ఏర్పడే అవకాశాలున్నాయి.
పాత, కొత్త మిత్రులు ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరికి ఆహ్వానం అందిందనే విషయం మరో రెండ్రోజుల్లో తేలనుంది. జూలై 18న జరగనున్న ఎన్డీయే భేటీకు హజరుకానున్న జనసేనాని ఏపీకు సంబంధించి ప్రతిపక్షాల్ని ఏకం చేసే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.
Also read: Srikalahasthi CI Anju Yadav: సీఐ అంజూ యాదవ్‌కి పవన్ కళ్యాణ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook