AP Elections 2024: రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తారనే అంశంపై కొద్దిగా స్పష్టత వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ రెండింటికీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎంపీగా విజయం సాధిస్తే బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వనుందనే వార్తలొస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్‌కు హామీ లభించినట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం-జనసేన కూటమిగా 100 సీట్ల వరకూ ప్రకటించి అందులో నారా లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటి నేతలు ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చింది. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో కూడా తేలింది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ అనేది ఇంకా సందిగ్దంలోనే ఉంది. దీనికి కారణం బీజేపీ పెద్దలు, జనసేనాని మధ్య జరిగిన అవగాహన అని తెలుస్తోంది. ఈసారి పపవ్ కళ్యాణ్ అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండింట్లో పోటీ చేయవచ్చని సమాచారం. ఎందుకంటే తెలుగుదేశం-జనసేన విజయం సాధిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో మరోసోరి బీజేపీ రావడం ఖాయమని భావిస్తున్న తరుణంలో ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఉంటుందనేది ప్రధాన ఆలోచన. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్‌కు ఈ దిశగా హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ద్వారా కాపు ఓటు బ్యాంకుతో ఏపీలో బలపడాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. 


అందుకే కాపు సామాజికవర్గం బలంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ లోక్‌సభకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది. గతంలో పీఆర్పీ సమయంలో అల్లు అరవింద్ ఇక్కడ్నించి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం మద్దతు ఉన్నందున పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారనే అంచనా ఉంది. ఇక అసెంబ్లీ అయితే ఎక్కడ్నించి అనేది ఇంకా స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం పిఠాపురం లేదా తాడేపల్లిగూడెం పేరు విన్పిస్తోంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్నించి పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 


Also read: Jagan: ముఖ్యమంత్రిగా వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook