AP Elections 2024: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చుతున్నారు. 2024 ఎన్నికల లక్ష్యంగా ఇప్పట్నించే పావులు కదుపుతున్న జనసేనాని..ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై స్పష్టత వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పడం ద్వారా ప్రతిపక్షాలు కలిసి పోటీకి దిగాలనే సంకేతాల్ని ఇచ్చారు. గత ఎన్నికల్లో అంటే 2019లో జనసేన, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అదే సమయంలో పోటీ చేయకపోయినా..2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పార్టీలు నేరుగా మద్దతు ప్రకటించి..ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే...విడివిడిగా పోటీ చేసినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. అందుకే ఈసారి ప్రతిపక్షాలు ఒక్కతాటిపై రావాలనే పిలుపునిచ్చారు 


మరోవైపు 2014 ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాల విషయంపై కూడా జనసేనాని స్పష్టత ఇస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్నించి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈ నేపధ్యంలో ఈసారి వ్యూహం మార్చనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేకంటే..ఒకే నియోజకవర్గంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈసారి తూర్పు గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. కాపు సామాజికవర్గం ఓట్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్నించి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉంది. 


అందుకే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్ని పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనేది ఆయన ఆలోచనగా ఉంది. 2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఇప్పటి మంత్రి కన్నబాబు గెలిచారు. 2014లో పవన్ మద్దతుతో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 2019లో కూడా కన్నబాబే గెలిచినా...పార్టీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇక పిఠాపురంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి వంగాగీత విజయం సాధించగా..2014లో టీడీపీ అభ్యర్ధి ఎస్వీఎస్ఎన్ వర్మ గెలిచారు. మొత్తానికి ప్రజారాజ్యం పార్టీకి ఆశీస్సులు అందించిన నియోజకవర్గాలు కావడంతో ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవచ్చని తెలుస్తోంది. రెండింటిలో పోలిస్తే..కాపు ఓటింగ్ అత్యధికంగా ఉన్న పిఠాపురం ఎంచుకోవచ్చని తెలుస్తోంది. 


Also read: AP govt on Pegasus spyware: భూమన కరుణాకర్‌ రెడ్డి చైర్మెన్‌గా పెగాసస్ హౌజ్ కమిటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook