Janasena Party: అధికారిక గుర్తు గాజు గ్లాసును కోల్పోయిన జనసేన
Janasena Party: జనసేన అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఆ పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాసును ఇక లేనట్టే. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో జనసేనకు అధికారిక గుర్తు కేటాయించకపోవడమే దీనికి కారణం.
Janasena Party: జనసేన అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఆ పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాసును ఇక లేనట్టే. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో జనసేనకు అధికారిక గుర్తు కేటాయించకపోవడమే దీనికి కారణం.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో(Ysr Congress Party) పాటు తెలుగుదేశం, కాంగ్రెస్ , బీజేపీ, జనసేన , వామపక్ష పార్టీలున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల హోదాలో వైఎస్సార్ కాంగ్రెస్ , తెలుగుదేశం, జనసేన పార్టీలున్నాయి. జనసేనకు సంబంధించి ఆ పార్టీ అభిమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)బ్యాడ్‌న్యూస్ విన్పించింది. జనసేన పార్టీ అధికారిక గాజు గ్లాసు గుర్తును కల్పోయింది. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వ్‌డ్ గుర్తుల్ని కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఫ్యాన్ గుర్తు, టీడీపీకు సైకిల్, టీఆర్ఎస్(TRS)పార్టీకు కారు గుర్తులను రిజర్వ్‌డ్ గుర్తులుగా కేటాయించింది. ఈ జాబితాలో జనసేన పార్టీ లేదు. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వ్‌డ్ గుర్తులుంటాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు రిజర్వ్‌డ్ గుర్తులు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకు(Janasena party) కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగరీలో ఉంచింది. దీనర్ధం సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో పోటీ చేసే వారెవరికైనా కేటాయించవచ్చు. తిరుపతి ఉపఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తును(Tea Glass) ( Glass Tumbler)స్వతంత్ర అభ్యర్ధికి కేటాయించారు.
Also read: UNSC India: భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook