Janasena Clarity: విశాఖలో మంత్రుల కార్లపై దాడంటూ ప్రచారం.. జనసేన వెర్షన్ ఇదీ!
Janasena Official Clarity on Janasena People attack on AP Ministers: ఏపీలోని విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం మీద నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Janasena Official Clarity on Janasena People attack on AP Ministers: విశాఖ గర్జన పూర్తి చేసుకుని విజయవాడ బయలుదేరిన మంత్రుల కారులపై జనసేన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డి ఒక కారులో ఉండగా వారి కారు మీద బలమైన రాళ్లు కర్రలతో దాడి చేసినట్లు మీడియాకు సమాచారం అందింది. అయితే మంత్రి రోజా కారుపై కూడా ఎటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది, కానీ ఈ విషయం మీద ఇప్పటి వరకు సరైన క్లారిటీ అయితే లభించలేదు. అయితే జన సైనికులు దాడి చేశారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నాదెండ్ల మనోహర్ ఖండించారు.
జనసేన తరపున అధికారిక ప్రకటన విడుదల చేసిన ఆయన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్ర మంత్రుల కారు మీద దాడి జరిగినట్లు కానీ ఆ దాడి జనసేన వాళ్ళు చేసినట్లు గాని పోలీస్ శాఖ ఇప్పటివరకు నిర్ధారించలేదని పేర్కొన్న నాదెండ్ల మనోహర్ ఇవి కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమేనని అసలు దాడి సంస్కృతి అనేది మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ దాడి సంస్కృతిని ప్రోత్సహించే విద్యలో వైసీపీ వాళ్లు ఆరితేరిపోయారని విశాఖ విమానాశ్రయంలో ఒకప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మీద కోడి కత్తి దాడి అంటూ హడావుడి చేశారు ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో తేల్చలేదని ఆయన విమర్శించారు.
ఇప్పుడు కూడా అదే దారిలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒక పవిత్ర పదవిలో ఉన్న ఒక పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. అసలు మంత్రుల మీద దాడి జరిగితే వాళ్లకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా పోలీసులు ఉన్నప్పుడే దాడి జరిగితే అది పోలీస్ శాఖ వైఫల్యం గానే భావించాల్సి ఉంటుందని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనను ఆహ్వానించేందుకు భారీ జన సందోహం కదిలి వచ్చిందని అందుకే రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మీడియా దృష్టి మళ్లించేందుకే వైసీపీ ఈ నాటకానికి తెర తీసిందని ఆయన అన్నారు.
విశాఖ వాసులకు రాష్ట్ర ప్రజలకు ఈ విషయంలో వాస్తవాలు ఏంటో తెలుసన్న ఆయన మంత్రుల కాకమ్మ కథలు ప్రస్తుతం ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. ఇక జనసేన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ కి తగినంత బందోబస్తు కల్పించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాసి విశాఖ పోలీస్ కమిషనర్ కు మా పార్టీ నేతలు లేఖ ఇస్తే ఆయనకు అదనపు భద్రత కల్పించే విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాదేండ్ల మనోహర్ విమర్శించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పర్యటనకు ఇబ్బందులు కలిగించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వెళుతున్న దారిలో స్ట్రీట్ లైట్స్ కూడా వెలగకుండా చేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
Also Read: Jansainiks Attack: రోజా, జోగి రమేష్ కార్లపై జనసైనికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
Also Read: Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook