Janasena Condemns AP Intellegence Report: జనసేన పార్టీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేస్తోందన్న ప్రచారంపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ''డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ప్రజాపోరాటం చేస్తోన్న జన సైనికులు, వీర మహిళలు వ్యక్తులు, వ్యవస్థల మీద దాడులు చేసినట్టుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు'' అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వ్యవస్థలు, వ్యక్తుల మీద దాడులు చేసే విష సంప్రదాయం జనసేన పార్టీలో లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తోన్న జనసేన పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం నుంచి కొత్త కుట్రలకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన 13 మంది ప్రజాప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు ఏ క్షణమైనా దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పోలీసు ఇంటిలిజెన్స్ నివేదిక అందిందనే సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం ద్వారా లేనిపోని దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతు నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ డీజీపికి జనసేన డిమాండ్
ఏపీ పోలీసు ఇంటిలెజెన్స్ హెచ్చరికల పేరుతో శనివారం సాయంత్రం నుంచే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఓ దుష్ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 13 మంది వైసీపీ ప్రజాప్రతినిధుల మీద జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేస్తాయని పోలీసులు హెచ్చరించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసిన మాట నిజమే అయితే డీజీపీ దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనోహర్ డిమాండ్ చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఇంటిలిజెన్స్ నివేదికలు మీడియాకు ఎలా లీక్ అయ్యాయో దర్యాప్తు చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


ఏపీలో గొడవలు సృష్టించేందుకు కుట్ర 
జనసేన పార్టీ నేతల ఫోన్ల మీద నిఘా పెట్టడం మానేసి గోప్యంగా ఉండాల్సిన విషయాలు బయటకు ఎలా వెళ్తున్నాయనే అంశంపై డీజీపీ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీనే ఇలాంటి కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ర్యాలీలో డీసీపీని ఏకంగా పవన్ కళ్యాణ్ వాహనంపైకి ఎక్కించి రెచ్చగొట్టాలని, గొడవలు సృష్టించాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడిలా ఇంటెలిజెన్స్ నివేదికల పేరుతో మరో కొత్త కుట్రకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజల్లో వదంతులు సృష్టించి, తద్వారా గొడవలు జరిగేలా చేసి, ఆ నేరాన్ని జనసేన పార్టీ మీద నెట్టేయాలనేదే పాలకుల ఉద్దేశ్యంగా అర్థమవుతోందని అన్నారు. జనసైనికులు కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.


మేం రెడీ.. మీరు రెడినా ?
వచ్చే ఎన్నికల్లో ఎవరేంటో ప్రజలే నిర్ణయిస్తారని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేనపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తున్న నేతల కంటే ముందే వాలంటీర్లు ప్రజలకు సమాచారం ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే ప్రజాప్రతినిధులు ప్రజల్లో పర్యటిస్తున్నారు. అలాంటప్పుడు ఇక ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతాయి అని చెప్పడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు.జనసైనికులు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట దాటరు... శాంతి మార్గాన్ని వీడరని.. నాయకుడు నేర్పిన క్రమశిక్షణను తప్పకుండా పాటిస్తారని అన్నారు.


Also Read : Twitter trends: ట్విట్టర్ ట్రెండింగ్ లో ఏపీ మహిళా కమిషన్.. కారణం ఇదేనా..!


Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు షాక్.. మూడు పెళ్లిళ్లపై మహిళా కమిషన్ నోటీస్


Also Read : Pawan Kalyan Vs Ambati Rambabu: నాలుగో పెళ్లాం.. అరగంట! పవన్ కల్యాణ్, అంబటి మధ్య రచ్చ రచ్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి