Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు షాక్.. మూడు పెళ్లిళ్లపై మహిళా కమిషన్ నోటీస్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు షాకిచ్చింది ఏపీ ప్రభుత్వం. పవన్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు జారీ చేసింది.

Written by - Srisailam | Last Updated : Oct 22, 2022, 12:57 PM IST
  • చిక్కుల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
  • మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీస్
  • కామెంట్లను వెనక్కి తీసుకోవాలన్న వాసిరెడ్డి పద్మ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు షాక్.. మూడు పెళ్లిళ్లపై మహిళా కమిషన్ నోటీస్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా అధికార వైసీపీ, జనసేన మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. జనసేనాని విశాఖ పర్యటనలలో ఉద్రిక్తతలు తలెత్తడం.. తర్వాత అమరావతిలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను చెప్పులతో కొడతా అని హెచ్చరించడం రచ్చరచ్చైంది. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంలోనూ ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. తాజాగా పవన్ కల్యాణ్ కు షాకిచ్చింది ఏపీ ప్రభుత్వం. పవన్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు జారీ చేసింది.

మూడు పెళ్లిళ్ల పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసహరించుకోవాలని తన నోటీసులో పేర్కొన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. కోట్లు, లక్షల రూపాయల భరణం ఇచ్చి ఎవరి స్థాయిలో వారు విడాకులు ఇవ్వవచ్చూ అంటూ పవన్ చెప్పడం దారుణమన్నారు వాసిరెడ్డి పద్మ. ఎవరికి పడితే వారు భార్యలను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం వాడయం తీవ్ర ఆక్షేపనీయమని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై పవన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 పెళ్లిళ్లపై పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు వాసిరెడ్డి పద్మ. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చని ఆయన చేసిన కామెంట్లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. భరణం ఇచ్చి మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్‌ ఉపసంహరించుకోవాలని సూచించారు. భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా? అని ప్రశ్నించారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించం ఆక్షేపణీయం అన్నారు. ఎవరి జీవితంలో అయినా 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే కచ్చితంగా వ్యతిరేక అంశమేనని పద్మ స్పష్టం చేశారు. ఒక సినిమా హీరోగా , ఒక పార్టీ అధ్యక్షుడిగా మూడు పెళ్లిళ్లపై మీ మాటలు సమాజంపై ప్రభావం చాలా ప్రభావం చూపుతాయన్నారు. మీ వ్యాఖ్యలు మహిళల భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది.. పవన్ కల్యాణ్ వివరణ కోసం ఏపీ మహిళా కమిషన్ ఎదురుచూస్తుంది’ అని వాసిరెడ్డి పద్మ తన నోటీసులో మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News