పార్టీ సిద్ధాంతాలకు అద్దంపడుతూ ప్రజా క్షేమం, అభివృద్ధి పరమావధిగా మానవీయ కోణంతో ‘జనసేన’ మేనిఫెస్టో సిద్ధమౌతోంది. మేనిఫెస్టో రూపకల్పన బృందం సమావేశమై దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసి దీనికి తుది రూపు తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ దీనిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంది.. అనంతరం పార్టీ చీఫ్  ఆమోదించాల్సి ఉంది. అనంతరం ప్రకటన వెలువడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో మేనిఫెస్టో బృందంతో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ రోజు చర్చలు జరిపింది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, ప్రాధాన్యాలపై చర్చనడిచింది. జనసేన చీఫ్ చెప్పిన ఏడు సిద్ధాంతాల్లోని స్ఫూర్తి ప్రతి అంశంలోనూ ప్రతిబింబించేలా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. అనంతరం తమ అభిప్రాయాన్ని మేనిఫెస్టో బృందానికి తెలియజేసినట్లు సమాచారం. ఇక మిగిలింది పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆమెదించి బహిరంగంగా ప్రకటించడమే..


ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటికి చేపట్టాల్సిన పరిష్కారాలు, పథకాలు అమలులో లోపాలు, సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మేనిఫెస్టో బృందం ఈ మేరకు జనసేన మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఇందులో ఏఏ అంశాలు ఉన్నాయని విషయం తెలియరాలేదు. విజన్ డాక్యుమెంట్ ఆధారంగా మేనిఫెస్టో ఉంటుందని మాత్రమే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పేర్కొంది.