Janasena Formation Day: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన ఆవిర్భావ సభకు నో ఎంట్రీ..? పోస్టర్స్ వైరల్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతోంది. జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాపాకకి సభలో ఎంట్రీ లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
Janasena Formation Day: జనసేన పార్టీ అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందాడు. సాధారణంగా అయితే, ప్రజా ప్రతినిధిగా ఆ ఎమ్మెల్యే అన్నీ తానై ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించాలి. సభను విజయవంతం చేయాలి. కానీ, ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే సభ గురించి పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. ఆ ఎమ్మెల్యేకు సభకు రావడానికి అర్హత లేదంటూ పోస్టర్లు వెలిశాయి. అతని గురించి మాట్లాడితేనే జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతోంది. ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన ఈ సభను ఏర్పాటుచేసింది. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో సభను దిగ్విజయం చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భారీగా జనసైనికులు సభకు తరిలారు. అందరూ ఆహ్వానితులే అంటూ పవన్ ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయనుందని ప్రకటించారు. అందుకే ఈ సభను ఏపీ భవిష్యత్తును దిశానిర్దేశం చేసే సభగా చూడాలని కోరారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఆవరణలో కొన్ని పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. రాష్ట్రంలో జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనొక్కరే. ఎన్నికలు పూర్తయిన కొద్దిరోజులకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీలో కూడా వైసీపీకి మద్దతుగా ఆయన మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో రాపాక వరప్రసాద్ కు పార్టీ ఆవిర్భావ సభకు ఎంట్రీ లేదంటూ సభా ప్రాంగంణం వద్ద కొన్ని పోస్టర్లు వెలిశాయి. మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికుల.. పేరుతో పోస్టర్లు ఏర్పాటయ్యాయి. పార్టీకి నమ్మకద్రోహం చేశారనే ఆరోపణలు వరప్రసాద్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలిసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై రాపాక వరప్రసాద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: Washing Machine Offers: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.7 వేల బడ్జెట్ లో అమ్మకానికి వాషింగ్ మెషీన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook