Janasena Party - Balineni: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు అధికారం అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో అస్సలు ఉండలేకపోతున్నారు. వెంటనే అధికారంలో ఉన్న పార్టీలోకి మారిపోవాలని తెగ ఆరాటపడుతున్నారు.అయితే పార్టీ మారాలనుకునే వారికి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడిందంట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కూటమిలోని ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్ బాగా ఉంటుందో తెగ ఆలోచిస్తున్నారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీలో ఇప్పటికే  పెద్ద ఎత్తున కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు చేరగా  మరి కొందరు కూడా పసుపు కండువా కప్పుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే వైసీపీకీ చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ వైపు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఇప్పటికే టీడీపీలో ఆయా నిజయోజకవర్గాల్లో నేతలు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్లను కాదని అక్కడ మనం ఏమీ చేయలేమని వారి ఆలోచనట. టీడీపీలోకి పోయిన రేపటి రోజున టికెట్ వస్తుందా రాదా కూడా తెలియన పరిస్థితి..అలాంటప్పుడు టీడీపీలోకి పోయి ప్రయోజనం ఏంటి అని ఆ వైసీపీ నేతలు భావిస్తున్నారట . అలాంటి నేతలకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయట. అందులో ఒకటి జనసేన కాగా మరొకటి బీజేపీ. అవకాశాన్ని బట్టి వైసీపీ నేతలు ఈ రెండు పార్టీలోకి వెళితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.


బీజేపీకీ ఏపీలో పెద్దగా స్కోప్ లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బీజేపీపై కొంత వ్యతిరేకత మొదైలంది..మొన్నటి ఎన్నికల్లో  బీజేపీ మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందునా ఏపీలో కుల సమీకరణాలతో రాజకీయాలు ఉంటాయి తప్పా..మత పరమైన రాజకీయాలు ఉండవు. బీజేపీలో చేరితే పెద్దగా తమకు రాజకీయ ప్రయోజనం ఉండదనేది పార్టీ మారాలనుకుంటున్న వైసీపీ నేతల ఆలోచన. ఒక వేళ బీజేపీలో చేరినా అందులో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుంది తప్పా తమకు పెద్దగా అంతగా ప్రాధాన్యత ఉండబోదని వారు అనుకుంటున్నారు. 


ఇక వైసీపీ నేతలకు  జనసేన పార్టీ ఒక్కటే  పెద్ద దిక్కుగా కనిపిస్తుందంట. జనసేనలో చేరడానికి తెగ ఆసక్తి చూపుతున్నారట. జనసేనలో చేరితే మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆ నేతల ఆలోచనగా తెలుస్తుంది. దానికి ఒక కారణం లేకపోలేదు. జనసేనలో ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు లేరట.   అందునా జనసేనలో చేరితో రాబోయే రోజుల్లో ఎన్నికల్లో టికెట్ రావడం సులభంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారాట.


భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయసంగా టికెట్ రావాలంటే జనసేన పార్టీ అయితేనే బాగుంటుందని వైసీపీ నుంచి జనసేనలోనికి వెళ్లే నేతలు అనుకుంటున్నారట. అందుకే ఇప్పటికే పలువురు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ను కలిసి సంప్రదింపులు జరుపుతున్నారట. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకీ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా  ముద్ర అందునా జగన్ కు దగ్గరి బంధువు అయినా బాలినేని వైసీపీకీ రాజీనామా చేయడంపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.


వైసీపీనీ వీడాలనుకున్న బాలినేని వైసీపీ పెద్దలు బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ రాజీనామా చేసిన బాలినేని జనసేన అధినేత జగన్ ను కలవాలని అనుకుంటున్నాడట. అంటే ఇక జనసేనలో చేరడమే మిగిలింది అన్నమాట. మరోవైపు వైసీపీ మరో సీనియర్ నేత జగన్ తో మొదటి నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సామినేని కూడా త్వరలో జనసేనలో చేరుతారని కృష్ణా జిల్లాలో జోరుగా ప్రచారం అందుకుంది.ఈ మధ్య వైసీపీ రాజీనామా చేసిన మరో మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా జనసేనలోనే చేరే అవకాశం ఉందని ప్రచారం.


ఇలా వైసీపీకీ చెందిని ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు జనసేనలో చేరడానికి కారణం ఏంటా అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. జనసేనలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చేరుతున్నారా లేక దీని వెనుక ఇంకా ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో జరుగుతుంది.  ఈ మధ్య వైసీపీ నేతలు జనసేనను విమర్శించడం బాగా తగ్గించారు. పవన్ విషయంలో వైసీపీ కాస్తా ఆచితూచి స్పందిస్తుంది. ఎన్నికల ముందు పవన్ పై తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డ వైసీపీ ఇప్పుడు మాత్రం విమర్శలు తగ్గించింది.


దీనికి కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా ఏపీలో జరుగుతుంది. ఒక వైపు జగన్ ను కోటరీగా భావించిన వైసీపీ సీనియర్ నేతలు జనసేన వైపు చూడడం. మరోవైపు జనసేనాని విషయంలో వైసీపీ కాస్తా మెతగగా వ్యవహరించడం బట్టి ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కేంద్రంగా కాబోతుందా అన్న చర్చ కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వైసీపీనీ టార్గెట్ చేసే అవకాశం ఉంది కావున పవన్ రాజకీయంగా బలపరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ పెద్దల్లో ఉందంట. రేపటి రోజున టీడీపీ-జనసేన మద్య ఏదైనా పొరపొచ్చాలు వచ్చినా జనసేనకు అండగా నిలబడితే ఎలా ఉంటుందా అన్న చర్చ కూడా వైసీపీలో ఉందని టాక్. అందులో భాగంగానే వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరుతున్నారా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. 



ఈ పరిణమాలను బట్టి చూస్తుంటే భవిష్యత్తులో మరి కొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు, గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మరి కొందరు  కీలక నేతలు  జనసేన కండువా కప్పుకోబోతున్నారని టాక్. మరోవైపు జనేసన కూడా ఈ చేరికలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. భవిష్యత్తులో పార్టీనీ మరింత బలోపేతం చేయాలంటే చేరికలను ప్రోత్సహించాలని అనకుంటుందట. రానున్న అతి కొద్ది రోజుల్లోనే మంగళగిరి వేదికగా ఒక భారీ బహిరంగ సభను కూడా జనసేన ప్లాన్ చేస్తుందంట.


ఈ వేదిక పైనే పలువురు కీలక నేతలు చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ తో సమానంగా ఏపీలో జనసేనను బలోపేత చేయాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నారట. జనసేన చేరికల విషయంలో టీడీపీ కూడా ఒకింత ఆరా తీస్తుందంట. వైసీపీ నుంచి ఎవరెవరు జనసేనలో చేరుతున్నారనే సమాచారం టీడీపీ పెద్దలు తెప్పించుకుంటున్నారట.



మొత్తానికి ఇప్పడు జనసేనలో చేరికలో ఏపీలో రాజకీయాలను ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. జనసేనలో ఎవరెవరు చేరుతారు..వారికి పార్టీలో ఎలాంటి స్థానం దక్కుతుంది..ఈ చేరికలు కూటిమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే సమాధానం చెబుతుంది.


 


Also read: Saturn Transit: శనిగ్రహం నక్షత్రం మారుతోంది ఈ 6 రాశులకు డిసెంబర్ 27 వరకు ఏం జరగబోతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.