Guntur West Assembly Constituency: ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. పొత్తుల్లో భాగంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల కసరత్తు కొనసాగుతోంది. సమీకరణాలు.. నేతల బలాబాలు ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. జనసేన నుంచి టీడీపీకి తమ పార్టీ పోటీ చేయాలనుకునే సీట్లపైన ప్రతిపాదనలు అందాయి. దీంతో ఇప్పుడు టీడీపీ ఈ సీట్ల కేటాయింపుపైన కీలక నిర్ణయాలకు సిద్దమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడే సీట్లు ఎవరికనేది బయటకు చెప్పటం ద్వారా సమస్యలు వస్తాయని భావిస్తున్న రెండు పార్టీల అధినేతలు.. అంతర్గతంగా మాత్రం కసరత్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించడం ఆసక్తి రేపుతోంది. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై జనసేనాని ఆరా తీశారు. జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. గుంటూరు నగరంలో వచ్చే ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 


పార్టీ కమిటీలు, నగరంలో కీలక నాయకుల పని తీరు గురించి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తీరును తెలుసుకున్నారు. నగరంలోని రెండు నియోజకవర్గాలూ పార్టీకి ఎంతో కీలకం అని.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను పోలింగ్ బూత్ వరకు తీసుకుని వెళ్లాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా శ్రేణులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని చెప్పారు. రాజకీయంగా ఏ చిన్న విషయం అయినా.. ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలన్నారు. కచ్చితంగా గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో బలంగా జనసేన సత్తా చూపేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.


అయితే టీడీపీ కంచుకోట లాంటి గుంటూరు పశ్చిమ సీటుపై పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఫోకస్ చేయడాన్ని చూస్తుంటే ఇక్కడి నుంచి జనసేన పార్టీని బరిలో ఉండబోతుందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఈ స్థానం నుంచి అధికార వైసీపీ మంత్రి విడదల రజినిని రంగంలోకి దింపింది. ఆమెను దీటుగా ఎదుర్కోవాలంటే జనసేన పార్టీకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇరు పార్టీల అధినేతలు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం జనసేన పార్టీ అయితే ఇటు కాపు సామాజిక వర్గంతో పాటు టీడీపీకి ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. గుంటూరు వెస్ట్‌లో టీడీపీ, జనసేన కూటమికి విజయం వరిస్తుందనేది ఇరు నేతల ఆలోచనగా కనిపిస్తోంది.


గుంటూరు వెస్ట్ ఇంచార్జ్‌గా ప్రకటించినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు విడదల రజిని. ఆమెకు అడ్డుకట్ట వేయటానికి పవన్ కళ్యాణ్‌నే స్వయంగా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ రజనీ దుకుడికి అడ్డుకట్ట వేయగలరో లేదో చూడాలి మరి.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook