Janasena-Tdp: తెలుగుదేశం - జనసేన సీట్ల సర్దుబాటు ఏపీలో మంటలు రేపుతోంది. జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినేత నిర్ణయంతో సర్దుకుపోదామని భావించేవారికంటే వ్యతిరేకించేవారే ఎక్కువగా కన్పిస్తున్నారు. ఆఖరికి కేటాయించిన 24 కూడా మిగులుతాయా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటు తీవ్ర అసంతృప్తి, నిరసనలకు కారణమౌతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్ని కేటాయించడాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం 40 స్థానాల్ని తెచ్చుకుంటారని ఆశించిన తరుణంలో 24 సీట్లే రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు టీడీపీ ప్రకటించిన జాబితాలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేశ్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లుంటే..జనసేన జాబితాలో కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా లేకపోవడం హాస్యాస్పదంగా మారుతోంది. 


జనసేన జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకుండా నాదెండ్ల మనోహర్ పేరుండటం మరింంత అసంతృప్తిని పెంచుతోంది. కూటమిలో బీజేపీ వచ్చిచేరితే మిగిలిన 57 స్థానాల్లో కొన్ని సీట్లను కేటాయించాల్సి వస్తుంది. అయితే టీడీపీలో సీనియర్లు వ్యతిరేకిస్తుండటంతో బీజేపీ వాటాగా ఇచ్చే స్థానాల్లో కూడా కొన్నింటిని జనసేన వాటాలోంచి ఇస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఇలా జరగదని తెలిసినా కార్యకర్తల్లో మాత్రం ఇవే అనుమానాలున్నాయి. ఇప్పటికే జనసేన కేడర్ చాలామంది రాజీనామా చేస్తున్నారు. 


అన్నింటికీ మించి జనసేన ప్రాబల్యం కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు సైతం టికెట్ కేటాయించకుండా నిడదవోలు వెళ్లమని చెప్పడంపై జనసేన కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అందుకే కేటాయించిన 24 స్థానాల్ని గెలిపించుకుని మిగిలిన స్థానాల్లో నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకు ఓటేసుకునేలా కాపు సామాజికవర్గం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 


Also read: AP DSC Application: డీఎస్సీ 2024 అప్లై చేయకపోతే వెంటనే చేయండి, ఇవాళే చివరి తేదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook