జనసేన సరికొత్త పంథా; ప్రజా సమస్యలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు !!
మంగళరిగిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన చీఫ్ పవన కల్యాణ్ యువ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
ప్రజా క్షేత్రంలో బలపడేందుకు జనసేన సరికొత్త పద్దతిలో అడుగులు వేసేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే పొలిటిబ్యూరో..పొలిటికల్ అఫైర్స్ లాంటి కమిటీలు ఏర్పాటు చేసిన జససేన చీఫ్ పవన్ కల్యాణ్ ..ఇప్పుడు ప్రజా సమస్యలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల పార్టీ తరఫున బరిలోకి దిగిన యువ అభ్యర్ధులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సమస్యల ఆధారంగా జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తుందని... కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలో సమస్యలపై అధ్యయనం చేసే పోరాటానికి నాయకత్వం వహించే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. ఆగస్ట్ 7 నాటికి కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు.
కమిటీల్లో యువతారానికే పెద్దపీట.. !!
కొత్తగా ఏర్పడే కమిటీల్లో సింహభాగం యువతానికి కేటాయిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడిన వారికే సీట్లు ఇచ్చామని..అందులో రాజకీయల్లోకి కొత్తగా వచ్చిన వారే అధికంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ కుటుంబ నేపథ్యం , అనుభవం లాంటి ఆధారంగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నప్పటికీ రాజకీయ వ్యవస్థలో మార్పురావాలనే ఉద్దేశంతో గెలుపును పణంగా పెట్టిమరి యువతానికి సీట్లు కేటాయించామన్నారు.
ఇది తత్కాలిక ఓటమే..భవిష్యత్తు జనసేనదే !!
రాజకీయాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడమనేది తమ ఓటమికి అది ఒక ప్రధాన కారణమైనప్పటికీ ..అది తాత్కాలికమే అని తెలిపారు. భవిష్యత్తులో మరింత రాటుదేలడానికి ఒక మంచి అవకాశం మనకు అవకాశం వచ్చిన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ప్రజాసమస్యల పట్ల.. రాజకీయాల పట్ల మరింత అవగాహన పెంచుకోవాల్సిలని యువ అభ్యర్థులను పిలుపునిచ్చారు.
ఇక నుంచి బహునాయత్వానికి ప్రాధాన్యత !!
అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గానికి ఒక్కో నేతను కాకుండా బహునాయత్వాన్ని ప్రోత్సహిస్తామని పార్టీ విధానాన్నిపవన్ కల్యాన్ తెలిపారు.ఎన్నికల నాటికి సమీకణలు, పరిస్థితిని బట్టి, అభ్యర్ధి సామర్థ్యాన్ని బట్టి సీట్లు కేటాయించాల్సి వస్తున్న్నారు. కాబట్టి రాజకీయాల్లో తమను తాము నిరూపించుకునేందుకు.. రాణించేందుకు యువతారానికి ఇదోక మంచి అవకాశమని..ఇప్పటి నుంచి సరిగ్గా ఐదేళ్లు పోరాడితే తప్పకుండా ఫలితం వస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.