JC Vs Madhavi latha: మాధవీ లతపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగే కౌంటర్లు..
JC Vs Madhavi latha: రాయలసీమలోని అనంతపురంలోని తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కు రాజకీయంగా ప్రత్యేక పలుకుబడి ఉంది. అందులోనే జేసీ బ్రదర్స్ లో చిన్నవాడైన జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా దూకుడు ఎక్కువ. ఎదుటి వారు ఎంతటి వారైన తగ్గదేలే అంటూ వారికీ విరుచుకుపడుతుంటాడు.తాజాగా ఈయన బీజేపీ నేత కమ్ నటి మాధవీలతపై అనరాని పరుష పదజాలం వాడి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
JC Vs Madhavi latha: ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పైకి పొత్తులున్నా.. లోన మాత్రం ఒక పార్టీపై మరొకరు కత్తులు దూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కమ్ యాక్ట్రెస్ మాధవీలత చేసిన ఓ వీడియోపై అనంతపురం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కారు కూతలు కూసారు. ఆమెకు ఏకంగా ప్రాస్టిట్యూట్ గా పిలిచి అవమాన పరిచాడు. అసలు ఈ గొడవ ఎక్కవ మొదలైంది అంటే.. న్యూ ఇయర్ సందర్బంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో పురుషులతో పాటు ఆడవాళ్లు ఎక్కువ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాధవి లతా ప్రతి సోషల్ ఇష్యూపై స్పందిస్తూ ఉంటుంది. దీనిపై ఒక్కోసారి ఆమె చిక్కుల్లో పడ్డ సందర్భాలున్నాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్బంగా ఆమె విడుదల చేసిన వీడియో పై కొంత మంది రాద్దాంతం చేసారు.
కొత్త యేడాది సందర్బంగా బీజేపీ నేత మాధవీ లత తాడిపత్రిలో జేసీ పార్క్ కు రాత్రి పూట వెళ్లొద్దని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికి వెళ్లడం మహిళలకు అంత శ్రేయస్కరం కాదని పోస్ట్ పెట్టింది. పెన్నా నది పక్కన ఉన్న జేసీ పార్క్ లో చాలా మంది గంజాయి తాగేవాళ్లున్నారు. అలాంటి వారి మధ్య కొత్త యేడాది సెలబ్రేషన్స్ చేసుకుంటే మీరు చిక్కుల్లో పడతారు.
అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సెక్యూరిటీ ఫీలయ్యే ప్లేస్ లో ఆడవాళ్లు న్యూ ఇయర్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని సూచనలు సలహాలు ఇచ్చింది. ఒక మద్యం మత్తులో ఉన్న మనిషి .. వారికి ఎదురుగా కనపడ్డ మహిళపై అఘాత్యాలు చేయడానికైనా వెనకాడరని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను బేస్ చేసుకొని పట్టణ ప్రజలను తక్కువ చేసేలా మాధవి లతా మాట్లాడిందని తప్పు పట్టారు. బతుకు దెరువు కోసం పార్టీలు మారే వారితో మాట్లాడిస్తారా అని అనకూడని పరుష పదజాలం వాడారు. దీని కౌంటర్ గా బీజేపీ, మాధవీలతా అభిమానులతో తప్పుడు దారుల్లో వ్యాపారం గుండాగురి చేసే నీవు మాకు నీతులు చెబుతావా అంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి మరి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.