Jr NTR: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు.. చంద్రబాబు, పవన్ కళ్యాణు చుట్టునే కాదు.. మరో వ్యక్తి చుట్టు కూడా తిరుగుతున్నాయి. అతనే జూనియర్ ఎన్టీఆర్. గత కొన్నేళ్లుగా తారక్.. పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనేసన కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరిహిస్తోన్న మావయ్య చంద్రబాబు నాయుడుకు , జపసేనాని పవన్ కళ్యాణ్ కు , బాబాయి బాలయ్యకు.. అత్తయ్య.. పురంధేశ్వరితో పాటు లోకేష్, శ్రీ భరత్ లకు ప్రత్యేకంగా X వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా అదే సమయంలో వీరిని అభినందిస్తూ X ట్వీట్ చేసారు. తాజాగా ఈ రోజు జరిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీలో అందిరికీ ఆహ్వానాలు అందాయి. అటు మెగా ఫ్యామిలీకి అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వాళ్లకు ఆహ్వానాలు అందాయి. కానీ నందమూరి మూడో తరంలో అగ్ర కథానాయకుడిగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతున్న తారక్ కు మాత్రం చంద్రబాబు తరుపున కానీ.. తెలుగు దేశం పార్టీ తరుపున కానీ ఎలాంటి ఆహ్వానం అందలేదనేది టాక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ ప్రత్యేకంగా ఇన్విటేషన్ వచ్చి ఉంటే తప్పకుండా వెళ్లేవాడని టాక్. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర క్యాబినేట్ మంత్రులు ఇతర ఎన్డీయే పక్ష నేతలు హాజరయ్యారు. మరోవైపు తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది.  ఈ నేపథ్యంలో చంద్రబాబు అండ్ టీమ్ జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే ఈ వేడుకకు పిలవకుండ పక్కన పెట్టినట్టు సమాచారం.


అప్పట్లో చంద్రబాబు సతీమణి.. మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలినా.. జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించలేదు. మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైయస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై అప్పట్లో తెలుగు దేశం శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. కానీ తారక్ మాత్రం.. ఎన్టీఆర్, వైయస్ఆర్ ఇద్దరు గొప్పవారే అంటూ చెప్పడంపై అప్పట్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. మరోవైపు బాబాయి బాలయ్య కూడా తన అల్లుడు లోకేష్ కు ఎక్కడా రాజకీయంగా అడ్డు వస్తాడన్న కారణంగా జూనియర్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆహ్వానించాలని అనుకున్నసొంత కుటుంబంలోని వారే జూనియర్ ఎన్టీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఈ వేడుకకు  పిలవకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు పిలిస్తే వెళ్లాలనుకున్న ఎన్టీఆర్.. పిలవని కారణంగా కామ్ గా ఉండిపోయాడు.  రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా లోకేష్ విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సందర్భంలో తారక్ కు ఆహ్వానం అందుతుందని అందరు అనుకున్నారు.  ఏది ఏమైనా ఇలాంటి ఓ అద్భుత వేడుకకు పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ శ్రేణులు  పిలిస్తే బాగుండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేళ జూనియర్ ఎన్టీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter